AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fitness: 40 ఏళ్ల తర్వాత కూడా మీరు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ వర్కౌట్స్ తప్పక చేయాల్సిందే!

40 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో కొన్ని సహజమైన మార్పులు మొదలవుతాయి. ఈ వయసులో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శారీరక శ్రమ చాలా ముఖ్యం. కాబట్టి మన శరీరాన్ని ఫిట్‌నెస్‌ ఉంచుకునేందుకు ఎలాంటి వ్యాయామాలు మన జీవనశైలిలో చేర్చుకోవాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

Fitness: 40 ఏళ్ల తర్వాత కూడా మీరు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ వర్కౌట్స్ తప్పక చేయాల్సిందే!
Best Exercises After 40
Anand T
|

Updated on: Jun 02, 2026 | 7:00 AM

Share

40 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో కొన్ని సహజమైన మార్పులు మొదలవుతాయి. వయసుతో పాటు కండరాల బరువు క్రమంగా తగ్గుతుంది.ఎముకలు బలహీనపడం స్టార్ట్ అవుతుంది. మెటబాలిజం మందగించి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వయసులో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శారీరక శ్రమ చాలా ముఖ్యం. అయితే, వయసు పెరిగే కొద్దీ శరీరానికి అవసరమైన వ్యాయామాలను ఎంచుకోవాలి. డైలీ వర్కౌట్స్ చేయడం వల్ల ఆనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. కాబట్టి 40 ఏళ్ల వయస్సు తర్వాత మీ డైలీ రోటీన్‌లో చేర్చుకోవడానికి ఏ వ్యాయామాలు ప్రయోజనకరంగా ఉంటాయో తెలుసుకుందాం.

40 ఏళ్ల వయస్సు తర్వాత ఏ వ్యాయామాలు అత్యంత ప్రయోజనకరంగా ఉంటాయి?

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచనల ప్రకారం.. గుండె ఆరోగ్యం, కండరాలు, ఎముకల బలాన్ని పెంచే వ్యాయామాలపై దృష్టి పెట్టాలి.

కార్డియో వ్యాయామాలు : వేగంగా నడవడం కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పడకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే సైక్లింగ్, ఈత పడపడం వల్ల శరీరానికి మంచి శక్తిని, ఓర్పు లభిస్తుంది

స్ట్రెంగ్త్ ట్రైనింగ్ : కండరాల బలం కోసం తేలికపాటి బరువులు ఎత్తడం లేదా రెసిస్టెన్స్ బాండ్స్ ఉపయోగించడం మంచిది. ఇలా చేయడం వల్ల కండరాలు, ఎముకలు బలోపేతం అవుతాయి.

యోగా, స్ట్రెచింగ్: శరీర ప్లెక్స్‌బులిటీని పెంచడానికి, నడుము, కీళ్ల నొప్పులను నివారించడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది.

వ్యాయామం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • వ్యాయామం స్టార్ట్ చేసే ముందు తప్పకుండా వార్మప్ చేయండి. అది పూర్తి చేసిన తర్వాత కూల్ డౌన్ చేయండి. ఇది గాయాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీరు చాలా కాలంగా వ్యాయామం చేయకపోతే, నెమ్మదిగా ప్రారంభించండి, అలాగే ఎక్కువ సేపు వర్కౌట్స్ చేయకండి.
  • పుష్కలంగా నీరు త్రాగండి, మీకు ఏవైనా నొప్పి, తల తిరగడం, లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి ఎదురైతే వెంటనే విశ్రాంతి తీసుకోండి. మీకు ముందు నుంచే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, మీ డాక్టర్ సలహా మేరకు వ్యాయామాలను ఎంచుకోండి.
  • క్రమం తప్పని వ్యాయామంతో పాటు సమతుల్య ఆహారం కూడా అంతే ముఖ్యం. మీ ఆహారంలో ప్రొటీన్, కాల్షియం, విటమిన్ డి, ఇతర అవసరమైన పోషకాలను చేర్చండి. తగినంత నిద్రపోండి, ఒత్తిడిని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి.
  • అలాగే, ఎక్కువ సేపు కూర్చోవడం మానుకోండి, రోజంతా చురుకుగా ఉండేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు క్రమం తప్పని శారీరక శ్రమ, వయసు పెరిగే కొద్దీ కూడా మీ శరీరాన్ని దృఢంగా, శక్తివంతంగా ఉంచడంలో సహాయపడతాయి.
  • ఆరోగ్యకరమైన అలవాట్లు మరియు క్రమశిక్షణతో కూడిన వ్యాయామం.. వయసు పెరిగినా మిమ్మల్ని ఎల్లప్పుడూ ఉత్సాహంగా, దృఢంగా ఉంచుతాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us