AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress: తెలంగాణలో కనిపిస్తున్న కర్ణాటక ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. చర్చకు దారి తీస్తున్న రేవంత్ రెడ్డి కామెంట్స్

కర్ణాటకలో ఎన్నిక ఫలితాల ఎఫెక్ట్‌.. తెలంగాణలో మెల్లమెల్లగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఆ పార్టీ జోరు పెంచుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఘర్‌వాపసీ పాలిటిక్స్‌కు పునాది పడినట్టు తెలుస్తోంది. క్షణికావేశంలో పార్టీని వీడినవారంతా మళ్లీ రావాలంటూ రేవంత్ రెడ్డి బహిరంగంగా పిలుపునిచ్చారు.

Congress: తెలంగాణలో కనిపిస్తున్న కర్ణాటక ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. చర్చకు దారి తీస్తున్న రేవంత్ రెడ్డి కామెంట్స్
Congress Flag
Aravind B
|

Updated on: May 18, 2023 | 5:59 PM

Share

కర్ణాటకలో ఎన్నిక ఫలితాల ఎఫెక్ట్‌.. తెలంగాణలో మెల్లమెల్లగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఆ పార్టీ జోరు పెంచుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఘర్‌వాపసీ పాలిటిక్స్‌కు పునాది పడినట్టు తెలుస్తోంది. క్షణికావేశంలో పార్టీని వీడినవారంతా మళ్లీ రావాలంటూ రేవంత్ రెడ్డి బహిరంగంగా పిలుపునిచ్చారు. నన్ను తిట్టినా పర్లేదు.. తెలంగాణకోసం కలిసి పనిచేద్దామంటూ.. వివేక్‌, రాజగోపాల్‌రెడ్డి, కొండావిశ్వేశ్వర్‌రెడ్డి వంటి కీలక నేతలను రేవంత్ ఆహ్వానించడం చర్చనీయమైంది.

కాంగ్రెస్ పార్టీ పనైపోయిందనుకుని దూరంగా జరిగినవాళ్లంతా ఇప్పుడు మళ్లీ హస్తం వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు.. టీమ్‌వర్క్‌గా పనిచేస్తే విజయం సాధించడం పెద్ద విషయం కాదనే తత్వం కర్ణాటక ఎన్నికలతో బోధపడినట్లు స్పష్టమవుతోంది. నాలుగు మెట్లు దిగేందుకు తాను సిద్ధమంటూ తాజాగా రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు ఆ కోవలోకే వస్తాయ్‌. ఏడాది క్రితం పార్టీ వీడి.. బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ నుంచి తనకు ఆహ్వానం ఉన్నమాట వాస్తమేనంటూ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తే.. ఇప్పుడు రేవంత్‌ చెప్పిన మాటలు దానికి మరింత బలాన్నిచ్చాయ్‌. తమ్ముడు రాజగోపాల్‌ రెడ్డి ఇలా అంటే.. అన్న వెంకట్‌ రెడ్డి వ్యాఖ్యలు సైతం అలానే ఉన్నాయి. సీఎం పదవి రేసులో తాను లేనంటూ.. నిన్ననే స్పష్టం ఇచ్చారు వెంకట్‌రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గపోరు లేదనీ.. తామంతా కలిసే ఉన్నామనీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!