తెలంగాణకు గుండెలాంటి సింగరేణిని అక్రమాల పుట్టగా మార్చారు.. సీబీఐ విచారణ జరపాల్సిందేః కిషన్ రెడ్డి
తెలంగాణకు గుండెలాంటి సింగరేణి.. ఇప్పుడు అవినీతి, అక్రమాలకు కేంద్రంగా మారిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి అక్రమాలపై CBI దర్యాప్తు జరగాల్సిందేనన్న ఆయన, సీబీఐ విచారణపై రాష్ట్రం ముందుకొస్తే కేంద్రం పరిశీలిస్తుందన్నారు. మంత్రుల మధ్య వాటాల వివాదంతోనే సింగరేణి అంశం వెలుగులోకి వచ్చిందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణకు గుండెలాంటి సింగరేణి.. ఇప్పుడు అవినీతి, అక్రమాలకు కేంద్రంగా మారిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి అక్రమాలపై CBI దర్యాప్తు జరగాల్సిందేనన్న ఆయన, సీబీఐ విచారణపై రాష్ట్రం ముందుకొస్తే కేంద్రం పరిశీలిస్తుందన్నారు. మంత్రుల మధ్య వాటాల వివాదంతోనే సింగరేణి అంశం వెలుగులోకి వచ్చిందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ విద్యుత్ అవసరాలను తీర్చేందుకు కేంద్రం ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్‌ను కేటాయించిందని గుర్తించారు. ఈమేరకు కోల్ బ్లాక్‌కు కేంద్రం అన్ని అనుమతులు ఇచ్చిందని స్పష్టం చేశారు. అయితే, టెండర్లు పూర్తి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. టెండర్లు రద్దు చేయడమంటే సింగరేణికి అన్యాయం చేసినట్లేనని ఆందోళన వ్యక్తం చేశారు. నచ్చినవారికి నైనీ కోల్ బ్లాక్ ఇవ్వాలని చూస్తున్నారన్నారు.
సింగరేణి తెలంగాణలోని 8 కంటే ఎక్కువ జిల్లాల్లో విస్తరించి ఉంది. తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. 136 సంవత్సరాల విశిష్ట వారసత్వం కలిగిన ఈ కంపెనీ బొగ్గు ఉత్పత్తి రికార్డులు సృష్టించిందన్నారు. అంతేకాదు తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారని కేంద్రమంత్రి గుర్తు చేశారు. అయితే తెలంగాణ ఏర్పాటుతో సింగరేణి సంస్థ కార్యాచరణ, ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవడం ప్రారంభించిందన్నారు. గతంలో లాభాల్లో నడిచిన కంపెనీ రాష్ట్ర అవతరణ తర్వాత ఇబ్బందుల్లో పడిందన్నారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని వాడుకుంటున్నాయని, లాభాల బాటలో ఉన్న సింగరేణిని సమస్యల సుడిగుండంలోకి నెట్టరని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. సింగరేణిని రాజకీయ ప్రయోగశాలగా మార్చేశారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణ 51% ఈక్విటీని కలిగి ఉంది. భారత ప్రభుత్వం 49% కలిగి ఉంది. అయినప్పటికీ నిర్వహణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వద్దనే ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రం నజోక్యం చేసుకోవడానికి పరిమిత అవకాశం ఉంది, బోర్డులో ముగ్గురు కేంద్ర డైరెక్టర్, ఏడుగురు రాష్ట్ర డైరెక్టర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఆ సమయంలో తెలంగాణ ప్రభుత్వం నుండి సింగరేణికి చెల్లించాల్సిన దాదాపు రూ. 32,000 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్న కేంద్ర మంత్రి, BRS కంపెనీని అణగదొక్కడానికి అనేక విధాలుగా ప్రయత్నించింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అనుసరిస్తోందని ఆరోపించారు. సింగరేణి కార్మికుల శ్రమ, త్యాగం రాజకీయ లాభం కోసం రెండు దోపిడీ చేశాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణి ఒకప్పుడు భారీ అప్పుల కారణంగా బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్‌స్ట్రక్షన్ (BIFR)లో చేరింది. తర్వాత NDA ప్రభుత్వం దానిని కాపాడిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో, రూ. 684 కోట్ల రుణ మారటోరియం కంపెనీ లాభదాయకతకు తిరిగి రావడానికి వీలు కల్పించిందన్నారు. 2014 తర్వాత, BRS ప్రభుత్వం సింగరేణిని రాజకీయ ప్రయోగశాలగా, అక్రమాలకు కేంద్రంగా మార్చారని మండిపడ్డారు. సింగరేణిలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలంటున్నారని, అయితే అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కూడా కావాలని తెలిపారు. ఈ వివాదంలోకి అనవసరంగా తనను లాగుతున్నారన్నారు.
మంత్రుల మధ్య వాటాల పంచాయితీతోనే.. సింగరేణి వ్యవహారం వెలుగులోకి వచ్చిందని కేంద్ర మంత్రి అన్నారు. గతంలో తాడిచర్ల కోల్ బ్లాక్‌ను కేంద్రం జెన్‌కోకు కేటాయించిందని, మైనింగ్ చేస్తామని సింగరేణి ముందుకొస్తే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బెదిరించిందన్నారు. తాము మైనింగ్ చేయబోమని బలవంతంగా లేఖ ఇప్పించారని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. ప్రైవేట్ సంస్థలకు వెళ్లేలా వ్యవహరించారని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పంథా కొనసాగిస్తోందని కిషన్‌రెడ్డి అన్నారు. సింగరేణిని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, సింగరేణి అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
