డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో 4 సబ్జెక్టులు ఫెయిల్.. హాస్టల్ భవనంపై నుంచి దూకిన విద్యార్ధిని! ఆ తర్వాత జరిగిందిదే
ఉస్మానియా యూనివర్సిటీ (OU) ఆంధ్ర మహిళా సభలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న 18 ఏళ్ల సాత్విక మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది. NCC గేటు సమీపంలోని ప్రైవేట్ హాస్టల్ 5వ అంతస్తు నుంచి దూకింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. అసలేం జరిగిందంటే..

హైదరాబాద్, జనవరి 21: అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ఘటన జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ (OU) ఆంధ్ర మహిళా సభలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న 18 ఏళ్ల సాత్విక మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది. NCC గేటు సమీపంలోని ప్రైవేట్ హాస్టల్ 5వ అంతస్తు నుంచి దూకింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. అసలేం జరిగిందంటే..
బుధవారం సాయంత్రం డిగ్రీ సెమెస్టర్ రిజల్టులు విడుదలైన వెంటనే సాత్వికకు 4 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినట్లు తెలిసింది. తీవ్ర మానసిక ఒత్తిడికి గురై సాత్విక హాస్టల్ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. సమీపంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు హుటాహుటుగా ఆంధ్ర మహిళా ఆసుపత్రికి తరలించారు.మెరుగైన చికిత్స కోసం ఆమెను గాంధీ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. అంబర్పేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
సాత్విక ఫ్యామిలీ, హాస్టల్ సిబ్బందిని విచారించి వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థుల మధ్య పెరుగుతున్న స్వీయ హత్యలపై పోలీసులు హెల్ప్‌లైన్‌లు ప్రచారం చేయాలని సూచించారు. OU నిర్వాహకులు కూడా కౌన్సెలింగ్ సెషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ విద్యార్థుల్లో చదువుల ఒత్తిడి వల్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, కౌన్సెలింగ్, మెంటల్ హెల్త్ సపోర్ట్ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం సాత్విక పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమె కుటుంబం ఆందోళన చెందుతోంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




