Hyderabad: ఘోర ప్రమాదం.. కళ్ల ముందే కన్న బిడ్డ ప్రాణాలు పోతుంటే తల్లడిల్లిపోయిన తల్లి..!
హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకున్న మరో ఘోర రోడ్డు ప్రమాదం అందరి హృదయాలను కలచివేసింది. పాఠశాలకు వెళ్తున్న సమయంలో జరిగిన ఈ విషాద ఘటన ఒక కుటుంబాన్ని తీరని శోకంలో ముంచేసింది. కళ్ల ముందే కన్న బిడ్డ ప్రాణాలు పోతుంటే ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఈ ఘోరం నేరెడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కే పురం ఫ్లైఓవర్ వద్ద జరిగింది.

హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకున్న మరో ఘోర రోడ్డు ప్రమాదం అందరి హృదయాలను కలచివేసింది. పాఠశాలకు వెళ్తున్న సమయంలో జరిగిన ఈ విషాద ఘటన ఒక కుటుంబాన్ని తీరని శోకంలో ముంచేసింది. కళ్ల ముందే కన్న బిడ్డ ప్రాణాలు పోతుంటే ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఈ ఘోరం నేరెడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కే పురం ఫ్లైఓవర్ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో 1వ తరగతి చదువుతున్న ఆరు సంవత్సరాల బాలుడిని స్కూలులో దిగబెట్టేందుకు టూ వీలర్‌పై తీసుకువెళ్తోంది తల్లి. ఆర్కే పురం ఫ్లైఓవర్ వద్దకు రాగానే వారి స్కూటీ అకస్మాత్తుగా స్కిడ్ అయ్యింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన భారీ ఆర్మీ వాహనం కింద తల్లి, కొడుకు పడిపోయారు. ఆరేళ్ల చిన్నారి ఆర్మీ ట్రక్ చక్రాల కింద పడి నలిగిపోయాడు. తల్లి తీవ్రగాయాలతో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదాన్ని చూసి చలించిపోయి స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించిన పోలీసులు, బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి నేరెడ్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక చిన్నారి ప్రాణం పోవడం తీరని విషాదమని పేర్కొంటూ.. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా భారీ వాహనాల సమీపంలో ప్రయాణించేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. పాఠశాలకో, ఆఫీసుకో వెళ్లేటప్పుడు కొన్ని నిమిషాల ఆలస్యమైనా పర్వాలేదు కానీ క్షేమంగా చేరుకోవడం అత్యంత ముఖ్యమని సజ్జనార్ హితవు పలికారు.
వీడియో ఇక్కడ చూడండి..
తిరుమలగిరిలో జరిగిన రోడ్డు ప్రమాదం మనందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ యాక్సిడెంట్ లో ఒక చిన్నారి ప్రాణం పోవడం తీరని విషాదం.
ఈ ఘటన నుండి నేర్చుకోవాల్సిన పాఠం చాలా ఉంది. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు దయచేసి ఈ విషయాలను గుర్తుంచుకోండి:
✅లారీలు, బస్సులు, ఆర్మీ ట్రక్కుల వంటి… pic.twitter.com/zWgUz9kRF0
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 21, 2026
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
