అటు పెళ్లి ముచ్చట్లు.. ఇటు హైదరాబాద్లో మృణాల్.. ఇంతకీ మ్యాటరేంటీ.. ?
Rajitha Chanti
Pic credit - Instagram
21 January 2026
నార్త్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. అందం, అభినయంతో మంచి ఫేమ్ సొంతం చేసుకుంది.
సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకుంది. అంతకు మంచి ఫ్యాన్ బేస్ సైతం ఎక్కువగానే ఉంది.
ఆ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్స్ సినిమాల్లో నటించి వరుసగా హిట్స్ అందుకుంది. ఇప్పుడు అడివి శేష్ సరసన డెకాయిట్ కథానాయికగా నటిస్తుంది.
ఈ మూవీని ఉగాది కానుకగా మార్చి 19న తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ రాగా.. మృణాల్ ఆకట్టుకుంది.
తాజాగా తన ఇన్ స్టాలో కొత్త ఏడాది.. కొత్త స్క్రిప్ట్.. కొత్త బిగినింగ్ అంటూ రాసుకొచ్చింది. సాబ్ న్యూ న్యూ.. హలో హైదరాబాద్ అంటూ పలకరించింది.
దీంతో ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. అదే సమయంలో తెలుగులో ఈ ముద్దుగుమ్మ మరో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.
కానీ ఆ సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ కొన్ని రోజులుగా మృణాల్ కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి పలు విషయాలు వినిపిస్తున్నాయి.
అటు ధనుష్ తో ఈ అమ్మడు కొన్ని నెలలుగా ప్రేమలో ఉందని.. వచ్చే నెలలో వీరిద్దరి వివాహం జరగనుందనే టాక్ రాగా.. వాటిని ఆమె టీమ్ ఖండించింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్