AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green Cementech 2023: నిర్మాణ రంగంలో విప్లవాత్మక మార్పులు.. మై హోమ్ గ్రూప్ చైర్మన్‌కు సీఐఐ సత్కారం..

మైహోమ్ సిమెంట్‌తో నిర్మాణ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావును సీఐఐ కొనియాడింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని ప్రశంసలు కురిపించింది. హైదరాబాద్‌లోని హైచ్ఐసీసీ నోవాటెల్లో..

Green Cementech 2023: నిర్మాణ రంగంలో విప్లవాత్మక మార్పులు.. మై హోమ్ గ్రూప్ చైర్మన్‌కు సీఐఐ సత్కారం..
My Home Group
Shiva Prajapati
|

Updated on: May 18, 2023 | 6:07 PM

Share

మైహోమ్ సిమెంట్‌తో నిర్మాణ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావును సీఐఐ కొనియాడింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని ప్రశంసలు కురిపించింది. హైదరాబాద్‌లోని హైచ్ఐసీసీ నోవాటెల్లో 19వ గ్రీన్ సిమెంటెక్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఐఐ, సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. నిర్మాణ రంగంలో జీరో కార్బన్ లక్ష్యంగా రెండు రోజుల పాటు ఈ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో.. మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావును సత్కరించారు నిర్వాహకులు.

అయితే, చైర్మన్ రామేశ్వరరావు అందుబాటులో లేకపోవడంతో.. ఆయనకు బదులుగా మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ రాము రావు ఈ సత్కారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాము రావు.. ‘నాన్నగారు బిజినెస్‌పై ఎంతో మక్కువతో ముందుకు వెళ్లారు. ఒడిదొడుకులు వచ్చినా వెనుదిరగలేదు. పట్టుదలతో పని చేసి విజయం సాధించారు. వ్యాపారాన్ని నమ్ముకొని ముందుకు వెళ్లారు.’ అని తన తండ్రి రామేశ్వరరావు కృషిని కొనియాడారు.

కాగా, సీఐఐ కాన్ఫరెన్స్‌కు హాజరుకాలేకపోయిన రామేశ్వరరావు.. వర్చువల్‌గా ప్రసంగించారు. నిర్మాణ రంగంలో అందరి సహకారంతోనే ‘మై హోమ్’ గ్రూప్ సక్సెస్ సాధ్యం అయ్యిందన్నారు. సిమెంట్ తయారీ ఇండస్ట్రీలో మార్పులను అందిపుచ్చుకున్నామని తెలిపారు. అవార్డు ఇచ్చిన సీఐఐకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణ రంగంలో పర్యావరణహిత సదుపాయాలు ముఖ్యమని, అందులో భాగంగా గ్రీన్ సిమెంటెక్ విధానాలతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. 2025 నుంచి జీరో కార్బన్ నిర్మాణం తమ టార్గెట్ అని పేర్కొన్నారు రామేశ్వరరావు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..