Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: నిజమే.. ఈ చెట్లకు డబ్బులు కాస్తాయి.. 500 చెట్లను నాటితే రూ.3 కోట్ల ఆదాయం..

మన తెలుగు రాష్ట్రాల్లో టేకు చెట్లకు చాలా డిమాండ్ ఉంటుంది. టేకు చెట్లతో ఇంటి గుమ్మాలు, తలుపులతో పాటు పడుకునే మంచాలు తయారు చేస్తారు. కాబట్టి వాటికి డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది. అయితే భారతదేశంలో మహాగని చెట్లకు కూడా భారీ డిమాండ్ ఉంది. మహాగని చెట్టు చాలా విలువైనది. ఈ చెట్టుకు చెందిన చెక్క, గింజలు, ఆకులు పూలతో సహా ప్రతి భాగానికి మార్కెట్‌లో డిమాండ్ ఉంది.

Business Idea: నిజమే.. ఈ చెట్లకు డబ్బులు కాస్తాయి.. 500 చెట్లను నాటితే రూ.3 కోట్ల ఆదాయం..
Mahogany
Follow us
Srinu

|

Updated on: May 18, 2023 | 6:15 PM

డబ్బులు చెట్లకు కాస్తున్నాయా? అంటూ మన పెద్దవారు తిడుతూ ఉంటారు. డబ్బును దుబారాగా పాడుచేయకుండా పొదుపు చేయాలి అనేది ఈ సామెత ప్రధాన ఉద్దేశం. డబ్బులు నిజంగా చెట్లకు కాయకపోయినా.. కొన్ని చెట్ల వల్ల నిజంగానే డబ్బు సంపాదించవచ్చు. సాధారణంగా ప్రపంచంలో ఎర్ర చందనం చెట్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అయితే కొన్ని చెట్లకు ఎర్ర చందనం అంత కాకపోయినా వాటి పరిధి మేరకు డిమాండ్ ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో టేకు చెట్లకు చాలా డిమాండ్ ఉంటుంది. టేకు చెట్లతో ఇంటి గుమ్మాలు, తలుపులతో పాటు పడుకునే మంచాలు తయారు చేస్తారు. కాబట్టి వాటికి డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది. అయితే భారతదేశంలో మహాగని చెట్లకు కూడా భారీ డిమాండ్ ఉంది. మహాగని చెట్టు చాలా విలువైనది. ఈ చెట్టుకు చెందిన చెక్క, గింజలు, ఆకులు పూలతో సహా ప్రతి భాగానికి మార్కెట్‌లో డిమాండ్ ఉంది. దీని కలప సంగీత వాయిద్యాలు, విగ్రహాలు, వాటర్‌క్రాఫ్ట్, అలంకార ఉత్పత్తులను రూపొందించడానికి ఉపయోగిస్తారు. వైద్యంలో ఉపయోగించే టానిక్ కోసం మహాగని విత్తనాలు, ఆకులను ఉపయోగిస్తారు. కొన్ని నివేదికల ప్రకారం మధుమేహం, క్యాన్సర్, ఆస్తమా, అధిక రక్తపోటు, ఇతర రుగ్మతలకు కూడా మహాగని ఆకులను ఉపయోగించి చికిత్స చేస్తారు. అలాగే కొన్ని వ్యవసాయ పురుగుమందులు కూడా మహాగని చెట్టు ఆకుల నుంచి తయారు చేస్తారు. సబ్బు, పెయింట్‌తో పాటు వార్నిష్ పరిశ్రమలన్నీ మహాగని ఆకుల నుంచి తీసిన నూనెను ఉపయోగిస్తాయి. కొండ ప్రాంతాలు మినహా భారతదేశంలోని అన్ని మైదానాల మహాగని పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి. రైతులు తమ భూముల్లో వాటిని నాటి పెంచడం ద్వారా అధిక ఆదాయాన్ని సంపాదించవచ్చు.

మహాగని మొక్క 12 సంవత్సరాలకు పూర్తి చెట్టుగా పరిపక్వం చెందుతుంది. దీని కలపను విక్రయించినప్పుడు క్యూబిక్‌ఫీట్‌కు రూ.1,300 నుంచి రూ. 2,500 వరకు ధర పలుకుతుంది. అయితే ధర అనేది చెక్క రంగుతో పాటు నాణ్యత ద్వారా ప్రభావితమవుతుంది. ఎరుపు రంగులో ఉండే కలపకు అధిక ధరను వసూలు చేస్తారు. అయితే గోధుమ రంగు కలప ధర కొంచెం తక్కువగా ఉంటుంది. మహాగని మొక్క 60 నుంచి 80 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. 12 సంవత్సరాల వయస్సులో దట్టంగా పెరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒక చెట్టు 40 క్యూబిక్ అడుగుల కలపను ఉత్పత్తి చేస్తుంది. క్యూబిక్ ఫీట్ కలప సగటున రూ.1,500కు విక్రయిస్తే ఒక్క మహాగని చెట్టు దాదాపు రూ.60 వేలకు విక్రయిస్తున్నారు.

ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మహాగని చెట్లు విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. ఒక మొక్క సుమారు 5 కిలోల విత్తనాలను ఇస్తుంది. మార్కెట్‌ ప్రకారం కిలో విత్తన ధర రూ.1000. 12 ఏళ్ల పాటు నిరంతరంగా రూ.10,000లకు విత్తనాల ద్వారా ఆదాయం పొందవచ్చు. ఒక మహాగని చెట్టు ఈ విధంగా 12 సంవత్సరాల కాలంలో రూ.70,000 ఆదాయాన్ని పొందవచ్చు. ఒక రైతు పొలంలో 500 చెట్లను నాటితే 12 ఏళ్ల తర్వాత వాటిని రూ.3 కోట్లకు అమ్మవచ్చు. ఈ 12 సంవత్సరాల్లో వ్యవసాయ భూమిలె సమీకృత వ్యవసాయంలో పాల్గొనడం ద్వారా ప్రత్యేకమైన ఆదాయాన్ని పొందవచ్చు. అలాగే మహాగని చెట్టు వేర్లు చాలా లోతుగా ఉండవు. అందువల్ల కొండ ప్రాంతాలలో నాటితే చెట్టు పడిపోయే అవకాశం ఉంటుంది. నీరు నిలిచే నేలలతో పాటు, రాతి నేలలో కూడా మహాగని నాటకూడదు. మహాగని మొక్కలు వేడి వాతావరణంతో పాటు అతి శీతల వాతావరణంలో పెరగవు. కాబట్టి మన రెండు తెలుగు రాష్ట్రాలు ఈ చెట్ల పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం