AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Home Loan: గృహరుణ ఖాతాదారులకు ఎస్‌బీఐ శుభవార్త… సిబిల్ స్కోర్ ఆధారంగా గృహ రుణ వడ్డీ రేట్లు

ఒక్క శాతం వడ్డీ తగ్గినా ఈఎంఐల్లో గణనీయమైన మార్పులు ఉండడంతో బ్యాంకుల గురించి తనిఖీ చేస్తూ ఉంటారు. అయితే గ‌ృహ రుణం మాత్రమే కాదు ఏ రుణమైనా బ్యాంకులు ఈ మధ్య కాలంలో బ్యాంకులు సిబిల్ స్కోర్ ఆధారంగా మంజూరు చేస్తున్నాయి. అయితే తాజాగా ప్రముఖ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణగ్రస్తులకు సిబిల్ స్కోర్ బాగుంటే తక్కువ ధరకే గృహ రుణాలను అందిస్తున్నట్లు పేర్కొంది.

SBI Home Loan: గృహరుణ ఖాతాదారులకు ఎస్‌బీఐ శుభవార్త… సిబిల్ స్కోర్ ఆధారంగా గృహ రుణ వడ్డీ రేట్లు
SBI
Nikhil
|

Updated on: May 18, 2023 | 6:45 PM

Share

సొంతిల్లు అనేది సగటు ఉద్యోగి కల. ముఖ్యంగా అద్దె భారాన్ని తొలంగించుకోవడంతో పాటు స్థిరమైన ఆస్తిని కొనుగోలు చేయాలనుకునే వారు సొంతిల్లు కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారు. అయితే ప్రస్తుతం స్థిరాస్తి ధరలు విపరీతంగా పెరగడంతో కొత్త ఇంటిని  కొనాలనుకునే ప్రతి ఒక్కరూ కచ్చితంగా గ‌ృహ రుణం తీసుకుని సొంతింటి కలను నిజం చేసుకుంటారు. అయితే గృహ రుణంపై ఈఎంఐలు చాలా ఎక్కువకాలం కట్టాలి కాబట్టి ఏయే బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తాయో? తెలుసుకుని వాటిలో గృహ రుణాలు తీసుకుంటూ ఉంటారు. ఒక్క శాతం వడ్డీ తగ్గినా ఈఎంఐల్లో గణనీయమైన మార్పులు ఉండడంతో బ్యాంకుల గురించి తనిఖీ చేస్తూ ఉంటారు. అయితే గ‌ృహ రుణం మాత్రమే కాదు ఏ రుణమైనా బ్యాంకులు ఈ మధ్య కాలంలో బ్యాంకులు సిబిల్ స్కోర్ ఆధారంగా మంజూరు చేస్తున్నాయి. అయితే తాజాగా ప్రముఖ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణగ్రస్తులకు సిబిల్ స్కోర్ బాగుంటే తక్కువ ధరకే గృహ రుణాలను అందిస్తున్నట్లు పేర్కొంది. ఆ వివరాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దరఖాస్తుదారుల క్రెడిట్ స్కోర్‌ల ఆధారంగా తన గృహ రుణాలకు విభిన్న వడ్డీ రేట్లను అందిస్తుంది. సిబిల్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న కస్టమర్‌లు సాధారణ హోమ్ లోన్‌పై 9.15 శాతం వడ్డీని పొందవచ్చు. 700-749 మధ్య క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తులు కొంచెం ఎక్కువ వడ్డీ రేటు 9.35%కి లోబడి ఉంటారు. ఇంకా 650-699 పరిధిలో క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి 9.45% వడ్డీ రేటు విధిస్తారు. ఈ రేట్లు మే 1, 2023 నుంచి వర్తిస్తాయని ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఏప్రిల్ ఆర్‌బీఐ తీసుకున్న చర్యల వల్ల గృహ రుణాలపై స్థిరమైన వడ్డీ రేట్లు అందించాలనే ఉద్దేశంతో ఎస్‌బీఐ తాజా నిర్ణయాన్ని తీసుకుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎస్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర బ్యాంకులకు గట్టి పోటినిచ్చే అవకాశం ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం