Loan Interest: బ్యాంక్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన వడ్డీ రేట్లు, ఎంతంటే..
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పండుగ పూట కస్టమర్లకు షాక్ ఇచ్చింది. వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన వడ్డీ రేట్లు ఆదివారం నుంచే అమల్లోకి రానున్నట్లు తెలిపింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను..
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పండుగ పూట కస్టమర్లకు షాక్ ఇచ్చింది. వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన వడ్డీ రేట్లు ఆదివారం నుంచే అమల్లోకి రానున్నట్లు తెలిపింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (MCLR) పెంచారు. రుణాలను బట్టి వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్ల మేరు పెంచారు. కాల వ్యవధి ఆధారంఆ రుణాలపై ఈ వడ్డీ రేట్ల పెంపు వర్తిస్తుంది. ఎస్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో నెలవారీగా లోన్‌లపై ఈఎమ్‌ఐలు చెల్లిస్తున్న వారు ఈ నెల నుంచి ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.
హౌసింగ్, పర్సనల్ లోన్ తీసుకున్న వారిపై ఆర్థిక భారం పడనుంది. ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్‌ఆర్ రేటు 7.70 శాతం నుంచి 7.80 శాతానికి చేరుకోనుంది. మిగతా రుణాలపై వడ్డీరేటును యథాతథంగా ఉంచడం విశేషం. దీంతో ఒక్కరోజు రుణాలపై వడ్డీరేటు 7.85 శాతంగా ఉండగా, నెల, మూడు నెలల రుణాలపై రేటు 8 శాతంగాను, ఆరు నెలల రుణాలపై ఎంసీఎల్‌ఆర్ రేటు 8.3 శాతంగా ఉన్నది. అలాగే రెండేండ్ల కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్‌ఆర్ రేటు 8.5 శాతంగా ఉంచిన బ్యాంక్..మూడేండ్ల రుణాలపై రేటును 8.6 శాతంగా ఉంచింది.
ఇదిలా ఉంటే ఈ వడ్డీ రేట్ల పెంపు కేవలం ఎస్‌బీఐకి మాత్రమే పరిమితం కాలేదు.. హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, ఐసీఐసీఐ, పీఎన్‌బీలు కూడా వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇక మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ విషయానికొస్తే.. బ్యాంకులు తన కస్టమర్లకు లోన్లు ఇవ్వాలంటే పరిగణనలోకి తీసుకోవాల్సిన బేసిక్ మినిమం రేటునే MCLR అంటారు. ఇదే రుణ ఆధారిత వడ్డీ రేటు. వేర్వేరు రకాల లోన్లు అందుబాటులో ఉన్న నేపథ్యంలో అన్నింటికీ ప్రామాణికంగా ఒక రేటు ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2016లో దీనిని ప్రవేశపెట్టింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..