Home Loan: భారీగా పెరిగిన గృహరుణాల వడ్డీ రేట్లు ముందే గృహ రుణం చెల్లించాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
లోన్ రీపేమెంట్ గడవు చాలా ఎక్కువ ఉండడంతో వడ్డీ భారం నుంచి ఉపశమనం పొందేందుకు దాన్ని ముందుగానే చెల్లించాలని కోరుకుంటారు. దీని కోసం వారు లోన్ క్లోజర్ లేదా ప్రీపేమెంట్‌ను ఎంపిక చేసుకుంటారు. చాలా బ్యాంకులతో పాటు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు ముందస్తు చెల్లింపు సౌకర్యాన్ని అందిస్తాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల రెపో రేటును 2.5 శాతం పెంచింది. దీంతో చాలా బ్యాంకులు తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్)ని పెంచాయి. ఈ పెరుగుదల నేరుగా గృహ, వాహన రుణాలపై ప్రభావం చూపుతుంది. ఒక సంవత్సరం క్రితం గృహ రుణం కోసం గతంలో 7 శాతం వార్షిక వడ్డీ రేటును చెల్లిస్తున్న కస్టమర్లు ఇప్పుడు దాదాపు 9.5 శాతం చెల్లించాల్సి వస్తోంది. ప్రజలు తమ కోరుకున్న గృహాలను కొనుగోలు చేయడానికి తరచుగా గృహ రుణాలను పొందుతారు. అయితే లోన్ రీపేమెంట్ గడవు చాలా ఎక్కువ ఉండడంతో వడ్డీ భారం నుంచి ఉపశమనం పొందేందుకు దాన్ని ముందుగానే చెల్లించాలని కోరుకుంటారు. దీని కోసం వారు లోన్ క్లోజర్ లేదా ప్రీపేమెంట్‌ను ఎంపిక చేసుకుంటారు. చాలా బ్యాంకులతో పాటు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు ముందస్తు చెల్లింపు సౌకర్యాన్ని అందిస్తాయి. అయితే చాలా కంపెనీలు గృహ రుణం ముందస్తు చెల్లింపు కోసం కొన్ని ఛార్జీలను విధిస్తాయి. అయితే, ప్రతి ఒక్కరూ ఈ ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు మీ హోమ్ లోన్‌ను త్వరగా చెల్లించాలనుకుంటే లేదా దాని భారాన్ని తగ్గించుకోవాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అవేంటో ఓ లుక్కేద్దాం.
పాక్షిక ముందస్తు చెల్లింపులు
గత కొన్ని సంవత్సరాలుగా మీ ఆదాయం పెరిగడంతో పాటు మీ పొదుపు పెరుగుతూ ఉంటే మీ లోన్‌పై పాక్షిక ముందస్తు చెల్లింపులు చేసే అవకాశం మీకు ఉంది. ఇది మీ లోన్ అసలు మొత్తాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా వడ్డీ బాధ్యత కూడా తగ్గుతుంది. వడ్డీకి కేటాయించిన మొత్తాన్ని తగ్గించడం ద్వారా మీరు మీపై ఉన్న మొత్తం భారాన్ని సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. చాలా బ్యాంకులు సుమారుగా 2 శాతం ముందస్తు చెల్లింపు రుసుమును విధిస్తాయి, అయితే రుణగ్రహీతలందరూ ఈ ఛార్జీకి లోబడి ఉండరు. ఫ్లోటింగ్ రేటుపై రుణాలు తీసుకున్న వ్యక్తులు ఈ రుసుము చెల్లించకుండా మినహాయింపు పొందవచ్చు. అయితే గృహ రుణం స్థిరమైన రేటును కలిగి ఉంటే ముందస్తు చెల్లింపు అనుబంధంగా ఉన్న చార్జీలు ఉండవచ్చు.
హోం లోన్ ఈఎంఐల పెంపు
చాలా బ్యాంకులు గృహ రుణ ఈఎంఐల చెల్లింపును దాదాపు 30 సంవత్సరాల టెన్యూర్‌తో అందిస్తాయి. అయితే క్రమేపి మన ఆదాయం పెరిగినా గృహ రుణంపై ఈఎంఐ మాత్రం తక్కువే చెల్లించాల్సి వస్తుంది. అయితే కొన్ని బ్యాంకులు గృహ రుణాలపై ఈఎంఐలను పెంచుకునే అవకాశం ఇస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ వంటి నిర్దిష్ట హోమ్ లోన్ లెండర్‌లు తమ కస్టమర్‌లకు వారి ఆదాయ వృద్ధికి అనుబంధంగా ప్రతి సంవత్సరం తమ హోమ్ లోన్ ఈఎంఐలను పెంచుకోవడానికి వీలు కల్పిస్తాయి. ఈ విధానం గృహ రుణాన్ని వేగంగా తిరిగి చెల్లించడంలో సహాయపడుతుంది.
ఈఎంఐ టెన్యూర్ తగ్గింపు
మీ మొత్తం రుణ భారాన్ని తగ్గించుకోవడానికి మీరు తక్కువ రుణ కాల వ్యవధిని కూడా ఎంచుకోవచ్చు. మీరు 15 సంవత్సరాలకు బదులుగా 25 లేదా 30 సంవత్సరాల లోన్ వ్యవధిని ఎంచుకుంటే మీ ఈఎంఐలు కచ్చితంగా తక్కువగా ఉంటాయి. కానీ మొత్తం లోన్ వ్యవధిలో చెల్లించే వడ్డీ రెట్టింపయ్యే అవకాశం ఉంది. తక్కువ కాల వ్యవధి లోన్‌ను ఎంచుకోవడం అంటే మీరు మొత్తం మీద తక్కువ వడ్డీని చెల్లిస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి