AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Loan interest Rates: వారెవ్వా ఈ బ్యాంకుల్లో గృహ రుణాలు ఇంత తక్కువ వడ్డీనా? ఆ బ్యాంకులేంటో తెలుసుకోండి

ఆకాశాన్నంటుతున్న ప్రాపర్టీ ధరలతో మీ కొనుగోలును సురక్షితంగా ఉంచుకోవడానికి మీరు తప్పని సరిగా హోమ్ లోన్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రకటించిన రెపో రేటు పెంపుతో గత ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలంలో గృహ రుణ రేట్లు గణనీయంగా పెరిగాయి.

Home Loan interest Rates: వారెవ్వా ఈ బ్యాంకుల్లో గృహ రుణాలు ఇంత తక్కువ వడ్డీనా? ఆ బ్యాంకులేంటో తెలుసుకోండి
Home
Nikhil
|

Updated on: May 14, 2023 | 7:30 PM

Share

ఇంటిని కొనడం లేదా కట్టుకోవడం అనుకున్నంత సులభం కాదు. ఆస్తిని ఖరారు చేయడం నుంచి నేపథ్య తనిఖీలు చేయడం, నిధులను  సమకూర్చుకోవడం చాలా కష్టం మీ సొంత నివాసం పొందడానికి నెలలు, మరికొన్నిసార్లు సంవత్సరాలు గడిచిపోతాయి. ఆకాశాన్నంటుతున్న ప్రాపర్టీ ధరలతో మీ కొనుగోలును సురక్షితంగా ఉంచుకోవడానికి మీరు తప్పని సరిగా హోమ్ లోన్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రకటించిన రెపో రేటు పెంపుతో గత ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలంలో గృహ రుణ రేట్లు గణనీయంగా పెరిగాయి. దీంతో గృహ రుణం తీసుకోవలనుకునే వారు గందరగోళానికి గురవుతున్నారు. మీ గందరగోళానికి చెక్ పెట్టేలా దేశంలో చౌకైన వడ్డీ రేట్లను అందించే పది బ్యాంకులు షార్ట్ లిస్ట్ చేశాం. ఇందులో గృహరుణాల వడ్డీ రేట్లు చాలా తక్కువ ఉంటాయి. అయితే గృహ రుణం అనేది మీ క్రెడిట్ స్కోర్, అలాగే రీపేమెంట్ చరిత్ర ఆధారంగా తుది వడ్డీ రేటు స్వల్పంగా మారవచ్చని గమనించాలి. గృహ రుణం తక్కువ ధరకు అందించే ఆ బ్యాంకులు ఏంటో? ఓ సారి తెలుసుకుందాం. 

ఇండియన్ బ్యాంక్:  మీరు ఇండియన్ బ్యాంక్ నుంచి పొందగలిగితే అత్యల్ప వడ్డీ రేటు 8.45 శాతం 9.1 శాతానికి చేరుకుంటుంది.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర : ఈ బ్యాంకులో 8.4 నుంచి 10.3 శాతం వరకు గృహ రుణాలను అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇండస్‌ఇండ్ బ్యాంక్:  మీ ప్రొఫైల్‌పై ఆధారపడి ఇండస్‌ఇండ్ బ్యాంక్ నుంచి గృహ రుణం మీకు 8.5 నుంచి 9.85 శాతం మధ్య ఉంటుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ : భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ రుణదాత హెచ్‌డీఎఫ్‌సీ 8.6 శాతం నుంచి గృహ రుణాలను అందిస్తుంది. అయితే రుణం తీసుకునే ఖర్చు వివిధ అంశాల ఆధారంగా 9.6 శాతానికి పెరగవచ్చు.

బ్యాంక్ ఆఫ్ బరోడా : బ్యాంక్ ఆఫ్ బరోడా 8.6 నుంచి 10.5 శాతం వడ్డీ రేట్ల మధ్య గృహ రుణాలు అందుబాటులో ఉన్నాయి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ : ఈ బ్యాంకులో 8.75 నుంచి 10.65 శాతం వరకు గృహ రుణాలను అందిస్తుంది.

యుకో బ్యాంక్ : ప్రభుత్వ రంగ రుణదాత 8.85 నుంచి 10.40 శాతం మధ్య వడ్డీ రేటుతో గృహ రుణాలను అందిస్తుంది.

కోటక్ మహీంద్రా బ్యాంక్ : కోటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణాలు 8.85-9.35 శాతం మధ్య వడ్డీ రేట్లలో అందుబాటులో ఉన్నాయి.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి సెక్యూర్ చేయబడిన గృహ రుణాలు కొన్ని సందర్భాల్లో 12 శాతానికి మించి 9 శాతం రేటుతో ప్రారంభమవుతాయి.

ఐడీబీఐ బ్యాంక్ : ఐడీబీఐ నుంచి మీ కొత్త ఇంటికి ఫైనాన్సింగ్ 9.1 – 12.25 శాతం మధ్య వడ్డీ రేటుతో వస్తుంది. 

గృహ రుణాన్ని పొందడం కోసం మీరు మీ ఆస్తి, ఆదాయంతో పాటు ఇతర వివరాలకు సంబంధించిన పత్రాలను సమర్పించాలి. ఇందులో సేల్ డీడ్, టైటిల్ డీడ్, ఆమోదించబడిన బిల్డింగ్ ప్లాన్‌లు, ఖాటా సర్టిఫికేట్, కంప్లీషన్ సర్టిఫికేట్ (కొత్తగా నిర్మించిన ఆస్తి విషయంలో) వంటివి ఉంటాయి. చివరి అవసరాన్ని రుణదాతతో తనిఖీ చేయవచ్చు. అయితే, గృహ రుణం తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవలసిన అనేక కీలక అంశాలు ఉన్నాయి. ముందుగా, మీ ఆర్థిక పరిస్థితిని పరిగణించండి. అలాగే మీ నెలవారీ బడ్జెట్‌తో రాజీ పడకుండా మీరు లోన్ ఈఎంఐలను సౌకర్యవంతంగా కొనుగోలు చేయగలరని నిర్ధారించుకోండి. దీర్ఘకాలంలో రుణాన్ని తిరిగి చెల్లించే మీ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి మీ ఆదాయ స్థిరత్వం, భవిష్యత్ అవకాశాలను అంచనా వేయండి. రెండోది వివిధ రుణదాతలు అందించే వడ్డీ రేట్లను సరిపోల్చాలి. అలాగే మీ అవసరాలకు సరిపోయే అత్యంత పోటీ రేటును ఎంచుకోవాలి. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి