Income Tax On Gifts: మీకు ఎవరైనా ఖరీదైన బహుమతి ఇచ్చారా? వాటిని ట్యాక్స్ కట్టాలా? నిబంధనలేంటో తెలుసుకోండి..
ముఖ్యంగా పన్ను చెల్లింపుదారుడు జీవిత భాగస్వామి లేదా వారి కుటుంబ సభ్యుల నుంచి వచ్చే బహుమతులపై పరిమితి పెట్టలేం కాబట్టి వాటికి కూడా పన్ను కట్టాలో? లేదో? కూడా చాలా మందికి తెలియదు. అయితే ఇలాంటి విషయాల్లో ఐటీ శాఖ ఓ నిర్ధిష్ట నిబంధనలు రూపొందించింది.

ఇతరుల నుంచి బహుమతులు పొందడం మనకు ఎల్లప్పుడూ మంచి అనుభూతిని కలిగిస్తుంది. కానీ ఇదే అంశం పన్ను చెల్లింపుదారులను తరచుగా గందరగోళానికి గురి చేస్తుంది. ఎందుకంటే మన అనుకునే వారు ఇచ్చిన బహుమతులపై పన్ను విధిస్తారా? అనే విషయం ఎప్పటికీ ఇబ్బందికరంగానే ఉంటుంది. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారుడు జీవిత భాగస్వామి లేదా వారి కుటుంబ సభ్యుల నుంచి వచ్చే బహుమతులపై పరిమితి పెట్టలేం కాబట్టి వాటికి కూడా పన్ను కట్టాలో? లేదో? కూడా చాలా మందికి తెలియదు. అయితే ఇలాంటి విషయాల్లో ఐటీ శాఖ ఓ నిర్ధిష్ట నిబంధనలు రూపొందించింది. ముఖ్యంగా ఒక వ్యక్తి లేదా హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) అందుకున్న బహుమతులపై పన్ను విధించే విషయంలో ఆదాయపు పన్ను శాఖ కొన్ని నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఐటీ శాఖ సర్య్యూలర్ ప్రకారం బహుమతి అనేది పరిగణనలోకి తీసుకోకుండా అందుకున్న ఏదైనా మొత్తం లేదా పరిగణనలోకి తీసుకోకుండా స్వీకరించిన ఏదైనా చర/స్థిర ఆస్తులుగా వర్గీకరిస్తారు. మార్కెట్ ధర కంటే తక్కువ రేటుతో పొందే చలన, స్థిరాస్తులు కూడా ఈ వర్గంలోకి వస్తాయి. నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50,000 కంటే ఎక్కువ ఏదైనా బహుమతి పన్ను పరిధిలోకి వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి బహుమతులు పొందే సమయంలో నిబంధనలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
- ఒక వ్యక్తి అందుకున్న బహుమతి కుటుంబ సభ్యుల నుంచి వస్తే ఆ మొత్తానికి పన్ను విధించరు. ఆదాయపు పన్ను శాఖ ప్రకారం బంధువు ఇలా ఉండాలి.
- వ్యక్తి జీవిత భాగస్వామి
- వ్యక్తి సోదరుడు లేదా సోదరి
- వ్యక్తి తల్లిదండ్రులలో ఎవరికైనా సోదరుడు/సహోదరి
- వ్యక్తి జీవిత భాగస్వామికి చెందిన సోదరి/సోదరుడు
- పన్నుచెల్లింపుదారుల జీవిత భాగస్వామి రేఖీయ వారసుడు లేదా అధిరోహకుడు
- పన్నుచెల్లింపుదారుల రేఖీయ వారసుడు లేదా అధిరోహకుడు
అలాగే ఓ ఒక వ్యక్తి వివాహం సందర్భంగా స్వీకరించిన బహుమతులపై పన్ను విధించరు. “వివాహం కాకుండా ఒక వ్యక్తి అందుకున్న ద్రవ్య బహుమతిపై మాత్రం పన్ను విధిస్తారు. అంటే, పుట్టినరోజు, వార్షికోత్సవం వంటి సందర్భాలలో అందుకున్న ద్రవ్య బహుమతులపై పన్ను విధిస్తారని ఐటీ శాఖ తన సర్క్యులర్‌లో పేర్కొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి