Pan Card Misuse: సైబర్ నేరగాళ్లు మీ పాన్ వాడారని అనుమానంగా ఉందా? ఇలా చేస్తే మీ కార్డ్ సేఫ్..

పాన్ కార్డ్ అంటే భారత ఆదాయపు పన్ను శాఖ ద్వారా జారీ చేసే ఒక ప్రత్యేకమైన పది అంకెలా అల్ఫాన్యూమెరిక్ ఐడెంటిఫయర్. భారతీయులు తమ పన్ను ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం వ్యక్తులు, సంస్థలకు పాన్ కార్డ్ ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా పని చేస్తుంది.

Pan Card Misuse: సైబర్ నేరగాళ్లు మీ పాన్ వాడారని అనుమానంగా ఉందా? ఇలా చేస్తే మీ కార్డ్ సేఫ్..
Pan Card
Follow us
Srinu

|

Updated on: May 18, 2023 | 4:45 PM

ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా దాన్ని వాడి చేసే మోసాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఆర్థికరంగ మోసాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) కార్డ్‌ల వంటి పత్రాల దుర్వినియోగం ఈ మధ్య కాలంలో ఎక్కువమంది ఫిర్యాదు చేస్తున్నారు. ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనీతో పాటు నటులు శిల్పాశెట్టి, అభిషేక్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ఇమ్రాన్ హష్మీతో సహా పలువురు ప్రముఖుల పాన్ కార్డ్ వివరాలను దుర్వినియోగం చేశారు. ముఖ్యంగా వీరి పేర్లపై క్రెడిట్ కార్డులు జారీ చేసేశారు. పాన్ కార్డ్ అంటే భారత ఆదాయపు పన్ను శాఖ ద్వారా జారీ చేసే ఒక ప్రత్యేకమైన పది అంకెలా అల్ఫాన్యూమెరిక్ ఐడెంటిఫయర్. భారతీయులు తమ పన్ను ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం వ్యక్తులు, సంస్థలకు పాన్ కార్డ్ ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా పని చేస్తుంది. పాన్ కార్డ్ లామినేటెడ్ కార్డ్ రూపంలో, ఐటి డిపార్ట్‌మెంట్ ద్వారా జారీ చేస్తారు. ఎవరు దరఖాస్తు చేసుకుంటారో? వారితో పాటు కొన్ని కొన్ని డిపార్ట్‌మెంట్ వారికి దరఖాస్తు లేకుండా ప్రత్యేకంగా నంబర్‌ను కేటాయిస్తుంది. ఇంతటి ప్రముఖమైన పాన్ నంబర్ దుర్వినియోగం ప్రస్తుత కాలంలో పరిపాటిగా మారింది. ముఖ్యంగా మన పాన్ కార్డ్ వల్ల ఏదైనా సంభావ్య నష్టాన్ని తగ్గించడానికి, అలాగే ఆర్థిక శ్రేయస్సును కాపాడుకోవడానికి మీరు పాన్ కార్డ్ దుర్వినియోగం చేసినట్లు అనుమానిస్తే వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మన పాన్‌కార్డ్ దుర్వినియోగం చేసినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో? ఓ సారి చూద్దాం.

బ్యాంక్ స్టేట్‌మెంట్ల పరిశీలన

మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, క్రెడిట్ కార్డ్ బిల్లులు తరచూ పరిశీలించుకోవాలి. ఏవైనా అనుమానాస్పద లేదా అనధికార కార్యకలాపాలను గుర్తిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి. ముఖ్యంగా మీ ప్రమేయం లేని కార్యకలాపాలపై సంబంధిత బ్యాంక్‌కు ఫిర్యాదు చేయాలి.

సిబిల్ స్కోర్ పర్యవేక్షణ

ఎప్పటికప్పుడు మీ సిబిల్ స్కోర్ నివేదికను పరిశీలించాలి. మీ పాన్ కార్డ్‌తో అనుబంధించబడిన ఏవైనా అనధికార ఖాతాలు లేదా క్రెడిట్ అప్లికేషన్‌ల కోసం దాన్ని సమీక్షించాలి. మీరు ఏవైనా వ్యత్యాసాలను కనుగొంటే వాటిని వెంటనే క్రెడిట్ బ్యూరోకు నివేదించాలి.

ఇవి కూడా చదవండి

ఆదాయపు పన్నుశాఖ ఖాతా తనిఖీ

ఆదాయపు పన్ను శాఖకు చెందిన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అలాగే మీ పాన్ కార్డ్ వివరాలను ఉపయోగించి మీ ఖాతాకు లాగిన్ అవ్వండి. మీ పన్ను ఫైలింగ్‌లను సమీక్షించాలి. ఏదైనా వ్యత్యాసాలు లేదా అనధికారిక మార్పులు లేవని నిర్ధారించుకోండి. ముఖ్యంగా ఫారమ్ 26 ఏఎస్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. ఇందులో అనుమానపు లావాదేవీలను గుర్తిస్తే వెంటనే ఆదాయపు పన్ను శాఖకు చెందిన స్థానిక కార్యాలయంలో ఫిర్యాదు చేయాలి.

పాన్ దుర్వినియోగాన్ని నివేదించండిలా

  • స్టెప్- 1 : టిన్ ఎన్ఎస్‌డీఎల్ అధికారిక పోర్టల్‌ని సందర్శించండి
  • స్టెప్- 2 : హోమ్ పేజీలో కస్టమర్ కేర్ విభాగం కోసం శోధించి, డ్రాప్-డౌన్ మెనూని తెరవాలి.
  • స్టెప్- 3 : డ్రాప్-డౌన్ మెను నుంచి’ఫిర్యాదులు/ ప్రశ్నలు’ తెరవాలి. అనంతరం ఫిర్యాదు ఫారమ్ వస్తుంది
  • స్టెప్- 4 : ఫిర్యాదు ఫారమ్‌లో అవసరమైన వివరాలను పూరించి, క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, ‘సమర్పించు’పై క్లిక్ చేస్తే సరిపోతుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి