SIP: రాబడి లేదని ఏడాదిలోనే ఫండ్‌ మార్చేస్తున్నారా? తొందరపడొద్దు.. ఇలా చేస్తే లాభాలు చూడొచ్చు..

ఏడాదిలోపు కాలంలో ఫండ్‌ పనితీరును బట్టి నిర్ణయం తీసుకొంటూ ఉంటారు. అయితే షార్ట్‌ టర్మ్‌ పనితీరును బట్టి ఈక్విటీ ఫండ్స్‌ విరమించుకోవడం అనేది తొందరపాటు చర్యే అవుతుంది. ఇది దీర్ఘకాలంలో కలిగే ప్రయోజనాలను అంచనా వేయలేదు. తద్వారా నష్టాన్ని కూడా తీసుకొస్తుంది.

SIP: రాబడి లేదని ఏడాదిలోనే ఫండ్‌ మార్చేస్తున్నారా? తొందరపడొద్దు.. ఇలా చేస్తే లాభాలు చూడొచ్చు..
Sip
Follow us
Madhu

|

Updated on: May 18, 2023 | 4:15 PM

పెట్టుబడిపై అధిక రాబడి కావాలనుకొనే వారికి బెస్ట్‌ ఆప్షన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌. మార్కెట్‌ ఒడిదొడుకులను ఎదుర్కొన్నా.. దీర్ఘకాలంలో మంచి రాబడిని ఈ ఫండ్స్ అందిస్తాయి. వీటిలో అ‍త్యంత ప్రజాదరణ పొందింది.. పెట్టుబడికి స్థిరమైన రాబడిని అందించేవి సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్స్(ఎస్‌ఐపీ). ప్రజలు దీనిలో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇది ఈ ఎస్‌ఐపీ లాభదాయకంగా ఉండకపోవచ్చు. కొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ ఏడాదిలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చేంత ఆదాయాన్ని కూడా అందించవు. అటువంటి సమయంలో ఏం చేయాలి? ఎస్‌ఐపీ కొని పూర్తిగా క్లోజ్‌ చేయాలా? లేక అలాగే కొనసాగించాలా? ఆర్థిక నిపుణులు ఏం చెబుతున్నారు? తెలుసుకుందాం రండి..

ఏడాది కాలంగా ఈక్విటీ ఫండ్స్‌కు కష్టకాలం నడుస్తోంది. వాటి పనితీరు ఆశించినంతగా లేదు. అయితే ఇది మదుపరులకు కొంత వెసులుబాటు కూడా కల్పిస్తోంది. అదేంటంటే అధిక నాణ్యత కలిగిన స్టాక్స్‌ను తక్కువ వ్యాల్యూయేషన్‌తోనే కొనుగోలు చేసే వీలుంటుంది. సరిగ్గా ఈ సమయంలోనే సిస్టమ్యాటిక్‌ ఇన్‌వెస్టమెంట్‌ ప్లాన్లు(ఎస్‌ఐపీ)ని వినియోగించుకోవాలి. సాధారణంగా ఈ ఎస్‌ఐపీలు దీర్ఘకాలంలో మంచి రాబడులను అందిస్తాయి. ఏదైనా ఈక్విటీ కొన్నేళ్ల పాటు మార్కెట్లో సర్కులేట్‌ అయితేనే దాని విలువ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఏడాదిలో మీరు పెట్టుబడి పెట్టిన ఎస్‌ఐపీ సరిగ్గా పనిచేయలేదన్న కారణంతో దానిని విరిమించుకోవడం అనేది తొందరపాటు చర్యే అవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఎందుకు సరిగ్గా పనిచేయడం లేదు..

మీరు పెట్టుబడి పెట్టిన ఎస్‌ఐపీ సరిగ్గా పనిచేయకపోతే.. అది ఎందుకు పనిచేయడం లేదు అన్న విషయాన్ని ముందు అధ్యయనం చేయాలి. కారణాలను విశ్లేషించాలి. ఇది మీకు ఆ ఎస్‌ఐపీపై పూర్తి అవగాహను తీసుకొస్తుంది. అప్పుడు దానిని పూర్తిగా విరమించుకోవాలా? లేక కొనసాగించాలా అన్న అంశంపై క్లారిటీ వస్తుంది. ఒకవేళ మీ ఈక్విటీ పనితీరు తక్కువగా ఉండటానికి కారణం సాధారణంగా మార్కెట్లో వచ్చే హెచ్చుతగ్గుల వల్ల అయితే మరింత కాలం దానిని కొనసాగించవచ్చు. అలాకాకుండా ఫండ్స్‌ ప్రాథమిక అంశాలకు విరుద్ధంగా అంటే ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ టీం మారడం, ఫిలోసఫీ, రిస్క్‌ మేనేజమెంట్‌ ఫ్రేమ్‌ వర్క్‌ వంటి వాటిల్లో వీక్‌గా కనిపిస్తే ఫండ్‌ను విరమించుకొని కొత్తదానిని ప్రారంభించడం మేలు. అయితే ఫండ్స్‌ విశ్లేషణలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇది మర్చిపోవద్దు..

సాధారణంగా పెట్టుబడిదారులు చేసే తప్పులు ఏంటంటే ఇటీవల కాలంలో ఫండ్‌ పనితీరును బట్టి నిర్ణయం తీసుకొంటూ ఉంటారు. అయితే షార్ట్‌ టర్మ్‌ పనితీరును బట్టి ఈక్విటీ ఫండ్స్‌ విరమించుకోవడం అనేది తొందరపాటు చర్యే అవుతుంది. ఇది దీర్ఘకాలంలో కలిగే ప్రయోజనాలను అంచనా వేయలేదు. తద్వారా నష్టాన్ని కూడా తీసుకొస్తుంది. అందుకే మొదటి ఫండ్‌ పనితీరు సక్రమంగా లేకపోవడానికి తగిన కారణాలు అంచనావేయడం.. ఫండ్స్‌ పోర్టుఫోలియో అట్రిబ్యూట్స్‌ని సరిచూసుకొని నిర్ణయం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..