Loan Interest Rates: ఆ బ్యాంకు వినియోగదారులకు షాక్.. లోన్లపై వడ్డీ రేటు భారీగా పెంపు.. భారం ఎంతంటే..

రుణాలకు సంబంధించి మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్)ని పెంచాలని కోటక్ మహీంద్రా బ్యాంక్ నిర్ణయించింది. దీంతో రుణాలు తీసుకున్న వినియోగదారులపై అదనపు భారం పడనుంది. వివిధ కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీ రేట్లను 10 బేసిస్‌ పాయింట్లు (బీపీఎస్) అంటే 0.10 శాతం పెంచింది.

Loan Interest Rates: ఆ బ్యాంకు వినియోగదారులకు షాక్.. లోన్లపై వడ్డీ రేటు భారీగా పెంపు.. భారం ఎంతంటే..
Interest Rates Hike
Follow us
Madhu

|

Updated on: May 18, 2023 | 3:45 PM

ప్రైవేటు బ్యాంకుల్లో కోటక్ మహీంద్రా బ్యాంకుకు మంచి గుర్తింపే ఉంది. విరివిగా లోన్లు మంజూరు చేస్తూ తన పరిధిని అంతకంతకూ పెంచుకుంటోంది. అయితే ఈ బ్యాంకు ఇటీవల తన రుణ విధానాలకు సంబంధించి చెప్పుకోదగ్గ మార్పును అమలు చేసింది. ప్రత్యేకించి రుణాలకు సంబంధించి మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్)ని పెంచాలని నిర్ణయించింది. దీంతో రుణాలు తీసుకున్న వినియోగదారులపై అదనపు భారం పడనుంది. వివిధ కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీ రేట్లను 10 బేసిస్‌ పాయింట్లు (బీపీఎస్) అంటే 0.10 శాతం పెంచింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

వడ్డీ రేట్లు ఇలా..

సవరించిన వడ్డీ రేట్లపై సమగ్ర వివరాల కోసం వినియోగదారులు కోటక్ మహీంద్రా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని బ్యాంకు అధికారులు సూచించారు. బ్యాంక్ వెబ్ సైట్ ప్రకారం.. విభిన్న కాలపరిమితి కలిగిన రుణాల వడ్డీ రేట్లు ఇప్పుడు 8.35 శాతం నుండి 9.35 శాతానికి పెరుగుతాయి. ఈ కొత్త వడ్డీ రేట్లు 2023, మే 16 నుంచి అమలులోకి రావడం గమనార్హం.

అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలోని అనేక ఇతర బ్యాంకులు కూడా తమ రుణ రేట్లలో మార్పులను చేశాయి. ఉదాహరణకు, బ్యాంక్ ఆఫ్ బరోడాను తీసుకుంటే ఫిబ్రవరి నెలలో దాని రుణ రేట్లలో 5 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) అంటే 0.05 శాతం పెంపుదల చేసింది. అదేవిధంగా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తన ఎంసీఎల్ఆర్ లింక్డ్ లోన్ రేటును 0.15 శాతం పెంచింది. అలాగే సౌత్ ఇండియన్ బ్యాంక్ రుణ రేట్లు కూడా 5 నుండి 10 బేస్ పాయింట్ల వరకు ఏప్రిల్లోనే పెంచింది.

ఇవి కూడా చదవండి

కారణం ఇదే..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మే 2022 నుంచి రెపో రేటు పెంచుకుంటూ వస్తోంది. ఫలితంగా గత ఏడాదిలో దాదాపు 250 బేసిస్ పాయింట్లు రేటు రేటు పెరిగింది. ప్రస్తుతం ఆర్‌బీఐ నిర్ణయించిన రెపో రేటు 6.50 శాతం వద్ద స్థిరంగా కొనసాగుతోంది. పర్యవసానంగా, బ్యాంకులు తమ వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి.

వచ్చే నెల (జూన్) 6-8 తేదీల మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ సమావేశం ఉంది. జూన్ 8న, ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నిర్ణయాలను ప్రకటిస్తారు. దేశంలో ద్రవ్యోల్బణం రేటు బాగా తగ్గింది కాబట్టి పలు కీలక నిర్ణయాలు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్