- Telugu News Photo Gallery Business photos New EPFO circular clarifies how to get Higher EPS pension and how much do you have to pay
EPFO Alert: ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు అలర్ట్.. మే 3 వరకే ఆ అవకాశం.. ప్రశ్నలపై క్లారిటీ ఇచ్చిన సంస్థ..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా లక్షలాది మంది పెన్షన్‌దారులకు శుభవార్త చెప్పింది. ఎక్కువ పెన్షన్ కావాలంటే.. దాని కోసం ఏమి చేయాలో EPFO ఇటీవల ఒక సర్క్యులర్ జారీ చేసింది. అధిక పెన్షన్ ఎంపికను ఎంచుకునే అవకాశాన్ని EPFO తన చందాదారులకు అందించిన విషయం తెలిసిందే. ఎక్కువ పెన్షన్ పొందడానికి చందాదారులు మే 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Updated on: Apr 24, 2023 | 1:58 PM

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా లక్షలాది మంది పెన్షన్‌దారులకు శుభవార్త చెప్పింది. ఎక్కువ పెన్షన్ కావాలంటే.. దాని కోసం ఏమి చేయాలో EPFO ఇటీవల ఒక సర్క్యులర్ జారీ చేసింది. అధిక పెన్షన్ ఎంపికను ఎంచుకునే అవకాశాన్ని EPFO తన చందాదారులకు అందించిన విషయం తెలిసిందే. ఎక్కువ పెన్షన్ పొందడానికి చందాదారులు మే 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ పింఛను విషయానికి సంబంధించి చందాదారులు అనేక ప్రశ్నలు వేస్తున్నారు. దీంతో EPFO తన ఇటీవలి సర్క్యులర్‌లో సమాధానం ఇచ్చింది.

ప్రజల ప్రశ్నలకు సమాధానమివ్వడానికి EPFO.. దీన్ని 3 విభాగాలుగా విభజించింది. పింఛను కోసం ఎవరైనా ఉమ్మడి దరఖాస్తును పూరిస్తే ఏమి చేయాలి..? ఉమ్మడి దరఖాస్తు ఫారమ్‌ను తప్పుగా పూరిస్తే ఏమి చేయాలి? ఉమ్మడి దరఖాస్తు ఫారమ్ తిరస్కరణకు గురైతే ఏం చేయాలి..? అనే ప్రశ్నలన్నింటికీ EPFO సమాధానాలు ఇచ్చింది.

ఉమ్మడి దరఖాస్తు నింపిన తర్వాత ఏం చేయాలి..?: సర్క్యులర్ ప్రకారం, మీరు ఉమ్మడి దరఖాస్తు కోసం అధిక పెన్షన్ నింపినట్లయితే, మీ ప్రాంతంలోని EPFO కార్యాలయంలో దరఖాస్తును ధృవీకరించిన తర్వాత, మీ జీతం వివరాలు EPFO పోర్టల్‌లో ఉన్న వివరాలతో ధృవీకరిస్తారు. ధృవీకరణ పూర్తయిన తర్వాత.. EPFO మిగిలిన డబ్బును తనిఖీ చేస్తుంది. ఆ తర్వాత అది బదిలీ చేయడానికి, డిపాజిట్ చేయడానికి ఆర్డర్‌ను ఫార్వార్డ్ చేస్తుంది. ఆ తర్వాత ఖాతాదారులు అధిక పెన్షన్ కోసం ఎంపిక అవుతారు.

ఉమ్మడి దరఖాస్తు ఫారమ్‌ను తప్పుగా పూరిస్తే..: మీరు జాయింట్ అప్లికేషన్ ఫారమ్‌ను తప్పుగా పూరించినా, వివరాలు సరిపోలకపోయినా..? ఇలాంటి సందర్భంలో EPFO మీకు మరొక అవకాశాన్ని ఇస్తుంది. ఒక నెలలో, మీరు మీ సరైన వివరాలను EPFOకి ఇవ్వాలి. డేటా సరిపోలని పక్షంలో EPFO సబ్‌స్క్రైబర్‌కు తెలియజేస్తుంది. సరైన వివరాలను మళ్లీ పంపడానికి ఒక నెల సమయం ఇస్తుంది.

ఉమ్మడి దరఖాస్తు తిరస్కరణకు గురైతే..?: మీ దరఖాస్తును తిరస్కరించే ముందు EPFO ఖచ్చితంగా ఒకసారి మీకు అవకాశం ఇస్తుంది. తద్వారా మీరు మీ తప్పులను సరిదిద్దుకోవచ్చు. దరఖాస్తు కోసం మళ్లీ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు, మీరు ఒక నెలలో సరైన సమాచారాన్ని ఇవ్వకపోతే, EPFO స్వయంగా మీ యజమాని నుంచి సరైన సమాచారాన్ని పొందవచ్చు. దానిని సరిగ్గా పొందిన తర్వాత, మీ దరఖాస్తును అంగీకరిస్తుంది. మీరు ఇచ్చిన సమాచారం తప్పు అని తేలితే దరఖాస్తును తిరస్కరిస్తుంది.

ఈపీఎఫ్ఓ చందాదారులు మే 3 వరకు ఎక్కువ పెన్షన్ పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే జీతం, పెన్షన్ తదితర వివరాలకనుగుణంగా సంస్థ పెన్షన్ ను నిర్దారిస్తుంది.

కాగా.. ఉద్యోగి జీతం, అలాగే సంస్థ వాటా సమాన మొత్తంలో పీఎఫ్ ఖాతాలో జమవుతాయన్న విషయం తెలిసిందే.. ఈ నగదును అత్యవసర సమయాల్లో తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే.. పదవీ విరమణ సమయంలో ఉద్యోగి ఖాతాలో ఉన్న నగదు మొత్తాన్ని అందిస్తుంది.





























