AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Top Electric Cars: అదిరే రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు 400 నుంచి 900 కిలోమీటర్లు తిరగొచ్చు..

ఎవరైనా కారు కొనుగోలు చేయాలి అనుకుంటే మొదటిగా చూస్తున్నది ఎలక్ట్రిక్ వేరియంట్ వైపు. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతుండటం, పర్యావరణ హితమైన వాహనాలు వాడాలన్న ప్రభుత్వ సూచనలతో ఎక్కువ మంది విద్యుత్ శ్రేణి వాహనాలు కొనుగోలు చేయడానికి మొగ్గుచూపుతున్నారు. మీరు కూడా అలాంటి ఆలోచనలతోనే ఉంటే ఈ కథనం మీ కోసమే. మార్కెట్లో బెస్ట్ రేంజ్ ఎలక్ట్రిక్ కార్లు మీకు పరిచయం చేస్తున్నాం. ఈ కార్లలోని బ్యాటరీలు బెస్ట్ ఇన్ ద మార్కెట్. సింగిల్ చార్జ్ పై ఏకంగా 400 కిలోమీటర్ల పైగా ప్రయాణించగలుగుతాయి. రండి వాటిపై ఓ లుక్కేద్దాం.

Madhu
|

Updated on: Apr 24, 2023 | 4:50 PM

Share
హ్యూందాయ్ కోనా ఈవీ(Hyundai Kona EV)..  ఈ ఎలక్ట్రిక్ కారులో  39.2 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే 452 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇది 136 PS, 395 Nm టార్క్‌ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. ఇది 9.7 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.  50 kW ఫాస్ట్ ఛార్జర్, 7.2 kW వాల్ బాక్స్ ఛార్జర్, 2.8 kW పోర్టబుల్ ఛార్జర్ ఉన్నాయి. 50 kW డీసీ ఫాస్ట్ ఛార్జర్ బ్యాటరీని 57 నిమిషాల్లో నే 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేస్తుంది. అనేక అడ్వాన్స్ డ్ ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 23.84 లక్షల నుంచి రూ. 24.03 లక్షలు.

1 / 6
మహీంద్ర ఎక్స్‌యూవీ 400(Mahindra XUV400)..  దీనిలో రెండు బ్యాటరీ ప్యాక్ లు ఉంటాయి. ఒకటి 34.5 kWh కాగా మరొకటి 39.4 kWh. సింగిల్ చార్జ్ పై ఏకంగా 456 కిలోమీటర్లు మైలేజీ ఇస్తుంది. అలాగే 150 PS, 310 Nm టార్క్ ఉత్పత్తి చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటార్‌ ఉంటుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 50 kW DC ఛార్జర్‌ను కలిగి ఉంది, 50 నిమిషాల్లో బ్యాటరీని 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయగలుతుంది. దీనిలో 60కి పైగా ప్రత్యేక ఫీచర్లు ఉంటాయి. దీని ధర రూ. 15.99 లక్షల నుంచి 18.99 లక్షల వరకూ ఉంటుంది.

2 / 6
ఆడి ఇ-ట్రాన్ జీబీ(Audi e-Tron G).. ఈ కారు లో డ్యూయల్-మోటార్ సిస్టమ్‌ ఉంటుంది. ఇది 469 bhp, 630 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 93 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఇది 800-వోల్ట్ నిర్మాణాన్ని ఉపయోగించుకుని వేగవంతమైన ఛార్జింగ్‌ని అనుమతిస్తుంది. కేవలం 22.5 నిమిషాల్లో బ్యాటరీని 80% చార్జ్ చేస్తుంది. ఇది ఒక్కసారి ఫుల్ చార్జ్ అయితే ఏకంగా 500కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఈ లగ్జరీ కారు ధర రూ. 1.79 కోట్ల నుంచి రూ. 2.04 కోట్ల వరకూ ఉంటుంది.

3 / 6
బీఎండబ్ల్యూ ఐ4(BMW i4).. దీనిలో బలమైన 337 bhp, 430 Nm టార్క్‌ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. దీనిలోని బ్యాటరీని కేవలం 10 నిమిషాలు చార్జ్ చేస్తే చాలు ఏకంగా 164 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. అదే ఫుల్ చార్జ్ చేస్తే ఏకంగా 590 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణం చేయవచ్చు. దీని ధర రూ. 69.9లక్షలుగా ఉంది.

4 / 6
కియా ఈవీ6(Kia EV6)..  దీనిలో 321 bhp, 605 Nm టార్క్‌ని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది.అలాగే 77.4 kWh సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్‌ ఇచ్చారు. 350 kW డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌ తో కేవలం 18 నిమిషాల్లో 80% ఛార్జ్‌ చేయవచ్చు. బ్యాటరీ సింగిల్ చార్జ్ పై ఏకంగా 708 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని ధర రూ. 60.95 లక్షల నుంచి రరూ. 65.95 లక్షలు ఉంటుంది.

5 / 6
మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580(Mercedes-Benz EQS 580)..దీనిలో 56-అంగుళాల హైపర్‌స్క్రీన్ డిస్‌ప్లేతో సహా అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఫీచర్లు ఉంటాయి.  516 bhp, 855 Nm టార్క్ ను ఉత్పత్తి చేసే శక్తివంతమైన మోటార్ ఉంటుంది. 107.8 kWh  సామర్థ్యంతో బ్యాటరీ వస్తుంది.  200 kW ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఉంది. దీంతో బ్యాటరీని 30 నిమిషాల్లో 80% వరకు ఛార్జ్ చేయవచ్చు. ఒక్కసారి ఫుల్ చేస్తే దాదాపు 857 కిలోమీటర్లు దూసుకెళ్లవచ్చు.  దీని ధర రూ. 1.55 కోట్ల నుంచి రూ. 2.45 కోట్ల వరకూ ఉంటుంది.

6 / 6