AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAN, Aadhaar: మీ పాన్, ఆధార్ కార్డ్ దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ఆధార్, పాన్‌కార్డు జీవితంలో ముఖ్యమైన పత్రాలుగా మారిపోయింది. ఆధార్ లేనిది ఏ పని జరగదు. చిన్న పాటి పనులకు కూడా ఆధార్‌ తప్పనిసరి కావాల్సిందే. అలాగే ఆర్థిక సంబంధిత వ్యవహారాలలో పాన్‌ కార్డు కూడా చాలా ముఖ్యం. బ్యాంకు ఖాతా నుంచి లావాదేవీలు జరిపే వరకు అన్నింటికి పాన్‌..

PAN, Aadhaar: మీ పాన్, ఆధార్ కార్డ్ దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
Aadhaar - Pan Card
Subhash Goud
|

Updated on: Apr 20, 2023 | 6:20 PM

Share

ఆధార్, పాన్‌కార్డు జీవితంలో ముఖ్యమైన పత్రాలుగా మారిపోయింది. ఆధార్ లేనిది ఏ పని జరగదు. చిన్న పాటి పనులకు కూడా ఆధార్‌ తప్పనిసరి కావాల్సిందే. అలాగే ఆర్థిక సంబంధిత వ్యవహారాలలో పాన్‌ కార్డు కూడా చాలా ముఖ్యం. బ్యాంకు ఖాతా నుంచి లావాదేవీలు జరిపే వరకు అన్నింటికి పాన్‌ కార్డు కావాల్సిందే. భారత్‌లో ఈ రెండు కూడా ముఖ్యమైన పత్రాలుగా మారిపోయాయి. అయితే ఆధార్‌, పాన్‌ విషయంలో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. వీటిని దుర్వినియోగం చేస్తున్నవీటిని దుర్వినియోగం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. డిజిటల్ యుగంలో ఇలాంటి దుశ్చర్యలు కాస్త తేలికయ్యాయి. మీ ఆధార్ నంబర్, పాన్ నంబర్ ఉపయోగించి క్రెడిట్ కార్డ్‌ని పొందడం వల్ల కొన్ని పొరపాట్లు జరగవచ్చు. ఎంఎస్ ధోని, శిల్పాశెట్టి, మాధురీ దీక్షిత్ తదితరుల పాన్ నంబర్‌ని ఉపయోగించి అక్రమార్కులు క్రెడిట్ కార్డులు పొందిన సంఘటన ఇటీవల ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ నేపథ్యంలో పాన్‌ నంబర్‌, ఆధార్‌ నంబర్లు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లకుండా ఎలా జాగ్రత్తపడాలి.

మీ పాన్ కార్డ్ దుర్వినియోగం అవుతుందో లేదో తెలుసుకోవడం ఎలా ?

మీ పాన్ కార్డ్ దుర్వినియోగం అవుతుందో లేదో తెలుసుకోవడానికి CIBILని సంప్రదించవచ్చు. మీరు Cbil, Paytm, Equifax , బ్యాంక్ బజార్ మొదలైన వాటి నుంచి ఆన్‌లైన్‌లో క్రెడిట్ నివేదికను పొందవచ్చు. ఇది మీ పాన్ నంబర్ కింద పొందిన అన్ని క్రెడిట్ కార్డ్‌లు, లోన్‌ల వివరాలను కలిగి ఉంటుంది. ఇందులో మీరు తీసుకోని ఏదైనా రుణం ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలి.

ఇవి కూడా చదవండి

పాన్ నంబర్ దుర్వినియోగమైతే ఫిర్యాదు చేయడం ఎలా ?

  • ముందుగా NSDL పోర్టల్‌ని సందర్శించండి
  • కస్టమర్ కేర్ విభాగంలో డ్రాప్ డౌన్ మెను ఓపెన్‌ చేయండి.
  • ఈ మెను నుంచి ఫిర్యాదులు, ప్రశ్నలపై క్లిక్‌ చేయండి
  • ఈ ఫిర్యాదు ఫారమ్‌లో అన్ని వివరాలను పూరించండి. చివరలో క్యాప్చా కోడ్‌ని నమోదు చేసి, సమర్పించు క్లిక్ చేయండి

పాన్, ఆధార్ నంబర్ దుర్వినియోగాన్ని నివారించడం ఎలా ?

  • మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఎక్కడా ఇవ్వకండి. పాన్, ఆధార్ కార్డులకు బదులు ఇతర పత్రాలు ఇచ్చే అవకాశం ఉంటే ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ తదితర పత్రాలు ఇవ్వవచ్చు. దీన్ని చాలా దుర్వినియోగం చేయలేము.
  • మీరు అధీకృతమని భావించే కంపెనీలు లేదా వ్యక్తులకు మాత్రమే పాన్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ఇవ్వండి. మీరు పాన్, ఆధార్ కార్డు ఫోటోకాపీని ఇచ్చినప్పటికీ, దానిపై మీ సంతకం, తేదీని ఉంచాలని గుర్తుంచుకోండి.
  • సోషల్ మీడియాతో సహా ఏదైనా ఆన్‌లైన్ పోర్టల్‌లో మీ పేరు, పుట్టినరోజు మొదలైనవాటిని అందించమని మిమ్మల్ని అడుగుతారు. మీ పూర్తి పేరు, పుట్టిన తేదీని వీలైనంత వరకు రాయడం మానుకోండి .
  • ప్రభుత్వం తప్పనిసరి అని చెబితేనే ఆధార్ నంబర్‌ను బ్యాంక్ ఖాతాకు లింక్ చేయండి.
  • మీ క్రెడిట్ నివేదికను తరచుగా చెక్‌ చేసుకోండి.
  • మీ ఫోన్ గ్యాలరీలో పాన్, ఆధార్ కార్డ్ ఫోటో ఉంచవద్దు. మొబైల్ పోయినట్లయితే నేరస్థులు ఈ నంబర్లను దుర్వినియోగం చేయవచ్చు .

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us