Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax: బ్యాంకులపై ఆదాయపు పన్ను శాఖ కన్ను.. ప్రైవేటు బ్యాంకులను నోటీసులు..!

ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ చాలా రోజులుగా 20కి పైగా ఇన్సూరెన్స్ సంస్థలు, వాటి సేల్స్ ఏజెంట్లకు సంబంధించిన దాదాపు 500 సంస్థలపై విచారణ చేపడుతున్నాయి. అయితే ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ బ్యాంకులపై దృష్టి సారించింది. ఎందుకంటే విచారణలో పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్లు..

Income Tax: బ్యాంకులపై ఆదాయపు పన్ను శాఖ కన్ను.. ప్రైవేటు బ్యాంకులను నోటీసులు..!
Income Tax
Follow us
Subhash Goud

|

Updated on: Apr 19, 2023 | 7:01 PM

ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ చాలా రోజులుగా 20కి పైగా ఇన్సూరెన్స్ సంస్థలు, వాటి సేల్స్ ఏజెంట్లకు సంబంధించిన దాదాపు 500 సంస్థలపై విచారణ చేపడుతున్నాయి. అయితే ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ బ్యాంకులపై దృష్టి సారించింది. ఎందుకంటే విచారణలో పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. నివేదికల ప్రకారం.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 131 ప్రకారం.. బీమా కంపెనీలకు అత్యవసర నోటీసులు పంపుతున్నాయి. ఇప్పుడు బ్యాంకులు, వినియోగదారుల చెల్లింపులపై కన్నేసింది. ఇందు కోసం బ్యాంకుల నుంచి సమాచారం కోరింది ఆదాయపు పన్ను శాఖ. ఆదాయపు పన్ను అధికారులు విచారణలు చేయవచ్చు. తద్వారా వారు వ్యక్తులు లేదా సాక్షులను పిలవవచ్చు. అలాగే అకౌంటింగ్ రికార్డులు, ఇతర పత్రాలను కూడా పరిశీలించవచ్చు.

ఆదాయపు పన్ను శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) ఈ విషయం పై, అనుమానిత పన్ను ఎగవేతకు సంబంధించి ఈ బీమా కంపెనీలపై విచారణ జరుపుతున్నాయి. బోగస్ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్‌లపై విచారణ చేస్తున్నాయి. కమీషన్ చెల్లింపులపై ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) నిబంధనలను ఉల్లంఘించడం ద్వారా పన్ను ఎగవేతపై పన్ను శాఖ విచారిస్తోంది.

60,000 కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలపై రెండు శాఖలు విచారణ జరుపుతున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. వీటిలో రూ. 5,500 కోట్లకు పైగా జీఎస్టీ ఎగవేత జరిగినట్లు అనుమానిస్తున్నారు. చాలా బీమా కంపెనీలు బ్యాంకులు ఇతర మధ్యవర్తులకు లీగల్ కమీషన్ కంటే ఎక్కువ కమీషన్ చెల్లిస్తున్నాయి. ఇది బీమా వ్యాపారంలో దోపిడీ, నిర్వహణ ఖర్చుల పెరుగుదలపై ఆందోళనలను లేవనెత్తింది. ఇందులో బీమా కంపెనీల కమీషన్ చెల్లింపుకు సంబంధించిన అంశం విచారణలో ఉంది. అయితే ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ గత వారం రెండు పెద్ద ప్రైవేట్ బ్యాంకులకు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

బీమా కంపెనీలకు కార్పొరేట్ బ్రోకర్‌లుగా వ్యవహరించే బ్యాంకులు ఈ సంస్థల నుంచి చట్టపరమైన మార్గాల ద్వారా చట్టపరమైన కమీషన్‌లను వసూలు చేస్తాయి. అయినప్పటికీ ఓవర్‌రైడింగ్ కమీషన్‌లు వివిధ మార్గాల్లో మళ్లించబడ్డాయి. బీమా కంపెనీలు మధ్యవర్తుల ద్వారా పేరోల్ లేదా బ్యాంకు ఉద్యోగులకు సరఫరా ఖర్చును చెల్లించినట్లు దర్యాప్తులో తేలింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి