Virtual Debit, Credit Cards: వర్చువల్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు.. ఇవి ఎలా పని చేస్తాయి.. ఆన్‌లైన్ లావాదేవీల కోసం సురక్షితమేనా?

ఇటీవలి కాలంలో టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చెందింది. బ్యాంకులు వర్చువల్ కార్డ్‌లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. వర్చువల్ కార్డ్‌లు భౌతిక బ్యాంక్ కార్డ్‌ల డిజిటల్ వెర్షన్‌లు. ఈ కార్డ్‌లు 16-అంకెలతో డిజిటల్‌గా రూపొందించబడిన కోడ్‌ను కలిగి ఉంటాయి. వీటిని ఒక లావాదేవీ లేదా నిర్దిష్ట సమయం కోసం మాత్రమే ఉపయోగించవచ్చు..

Virtual Debit, Credit Cards: వర్చువల్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు.. ఇవి ఎలా పని చేస్తాయి.. ఆన్‌లైన్ లావాదేవీల కోసం సురక్షితమేనా?
cards
Follow us
Subhash Goud

|

Updated on: Apr 18, 2023 | 8:22 AM

ఇటీవలి కాలంలో టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చెందింది. బ్యాంకులు వర్చువల్ కార్డ్‌లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. వర్చువల్ కార్డ్‌లు భౌతిక బ్యాంక్ కార్డ్‌ల డిజిటల్ వెర్షన్‌లు. ఈ కార్డ్‌లు 16-అంకెలతో డిజిటల్‌గా రూపొందించబడిన కోడ్‌ను కలిగి ఉంటాయి. వీటిని ఒక లావాదేవీ లేదా నిర్దిష్ట సమయం కోసం మాత్రమే ఉపయోగించవచ్చు. వర్చువల్ క్రెడిట్ కార్డ్ కూడా క్రెడిట్ కార్డే. అయితే ఇది ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటుంది. బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ద్వారా వీటిని క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రతి వర్చువల్ కార్డుకు ప్రత్యేకమైన కార్డు నెంబర్, సీవీవీ నెంబర్, వాలిడిటీ వంటి పూర్తి వివరాలు ఉంటాయి. రెగ్యులర్ క్రెడిట్ కార్డుల మాదిరే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లకు వర్చువల్ క్రెడిట్ కార్డులను ఉపయోగించుకోవచ్చు.

వర్చువల్ క్రెడిట్ కార్డుల వల్ల ఆన్‌లైన్ లావాదేవీలు మరింత భద్రంగా ఉండేటా ఉంటాయి. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేటప్పుడు లేదా చెల్లింపులు నిర్వహించేటప్పుడు వెండర్‌కు లేదా సంస్థకు మన క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అసలు వివరాలు తెలియవు. దీంతో మోసాలు జరిగేందుకు ఎలాంటి ఆస్కారం ఉండదు. అలాగే కార్డు పోతుందనే భయం కూడా అవసరం లేదు. అయితే ఈ వర్చవల్‌ కార్డులను కేవలం ఒకేసారి ఉపయోగించుకోవచ్చు. కార్డు వాలిడిటీ గరిష్టంగా 48 గంటల వరకు ఉంటుంది. కార్డు క్రెడిట్ లిమిట్, వాలిడిటీ అనేవి బ్యాంక్ ప్రాతిపదికన మారుతూ ఉంటాయని గుర్తించుకోండి. అలాగే క్రెడిట్ కార్డు లేకపోయినా కూడా వర్చువల్ కార్డును పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ వర్చువల్ క్రెడిట్ కార్డును బ్యాంక్ అకౌంట్ లేదా బ్యాంక్ డెబిట్ కార్డుతో లింక్ చేసుకోవలసి వస్తుంది. అందువల్ల వర్చువల్ కార్డులను ఎవరైనా తీసుకునే అవకాశముంది.

ఈ వర్చువల్ కార్డులు సాధారణంగా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలచే జారీ చేయడం జరుగుతుంది. వర్చువల్‌ని జారీ చేయడం కోసం డెబిట్ కార్డు, డెబిట్ కార్డును కలిగి ఉండవలసిన అవసరం లేదు. నెట్ బ్యాంకింగ్ లేదా బ్యాంక్ ఏదైనా యాప్‌ని ఉపయోగించే ఎవరైనా అతని పేరుకు వర్చువల్ డెబిట్ కార్డ్‌ని పొందవచ్చు. కానీ చాలా సందర్భాలలో క్రెడిట్ వర్చువల్ కార్డ్ ఇప్పటికే క్రెడిట్ కార్డ్‌ని కలిగి ఉన్న వ్యక్తికి మాత్రమే జారీ చేయబడుతుంది. ఏదేమైనప్పటికీ, భౌతిక క్రెడిట్ కార్డ్ లేని వ్యక్తికి కూడా వర్చువల్ క్రెడిట్ కార్డ్‌ని అందించే అనేక బ్యాంకులు ఉన్నాయి. వర్చువల్ కార్డ్‌ని ఉపయోగించడానికి ఒక వ్యక్తి సాధారణంగా వర్చువల్ కార్డ్ సేవలను అందించే ఆర్థిక సంస్థతో ఖాతాను తెరవాలి. ఖాతా తెరిచిన తర్వాత సదరు వ్యక్తి వర్చువల్ క్రెడిట్ కార్డ్‌ని సృష్టించి, దానిని వారి సాధారణ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ లేదా బ్యాంక్ ఖాతాకు లింక్ చేయవచ్చు. మీరు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినప్పుడు, మీరు ఫిజికల్ కార్డ్‌కు సమానమైన వర్చువల్ కార్డ్ నంబర్, సెక్యూరిటీ కోడ్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

వర్చువల్ కార్డ్‌లను ఉపయోగించడం అనేది ఆన్‌లైన్ కొనుగోళ్లు చేయగలిగేటప్పుడు మీ క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని లోవాక్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు, సీఈవో జ్యోతి భండారి అన్నారు. వర్చువల్ కార్డ్‌లోని మొత్తం మొత్తాన్ని ఉపయోగించే వరకు లేదా దాని చెల్లుబాటు గడువు ముగిసే వరకు వర్చువల్ డెబిట్ కార్డ్‌లు చెల్లుబాటు అవుతాయని చెప్పారు. వేర్వేరు వర్చువల్ కార్డ్ ప్రొవైడర్లు వేర్వేరు సమయ వ్యాలిడిటీతో కార్డ్‌ను జారీ చేస్తారు. ఆన్‌లైన్ కొనుగోళ్లు చేయడానికి వర్చువల్ కార్డ్‌లు సురక్షితమైనవని సీఏ, వ్యవస్థాపకుడు ఆశిష్ అరోరా అన్నారు.

వర్చువల్ కార్డ్‌ని ఉపయోగిస్తున్నప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని భద్రతా చిట్కాలు

  • మీ వర్చువల్ కార్డ్ వివరాలను ఎవరితోనైనా పంచుకోవడం మానుకోండి. అలాగే తెలియని వెబ్‌సైట్‌లు లేదా వ్యాపారుల నుంచి కొనుగోళ్లు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
  • మీ ఫోన్ లేదా ఇమెయిల్‌కి పంపబడిన కోడ్ వంటి ద్వారా మీ ఖాతాకు అదనపు భద్రతను జోడించడానికి రెండు-కారకాల ప్రమాణీకరణను సెటప్ చేయండి.
  • మోసపూరిత చర్యలో డబ్బును కోల్పోయే ప్రమాదాన్ని తగ్గించడానికి వర్చువల్ కార్డ్‌లో పరిమిత మొత్తాన్ని పరిమితిగా సెట్ చేయండి.

సాంప్రదాయ కార్డ్‌లతో పోలిస్తే భద్రతను అందిస్తాయి. అలాగే ఈ కార్డులు ఉపయోగించడం సులభం. క్రెడిట్ కార్డ్‌తో పోలిస్తే ఈ నంబర్‌లు అందించే భద్రత చాలా ఎక్కువ. వర్చువల్ కార్డ్ సురక్షితంతో వస్తుంది. దీనిని ఎవరు ట్రాక్‌ చేయలేరు. ఇది మీ క్రెడెన్షియల్ డేటాను హ్యాకర్ల నుంచి సురక్షితంగా ఉంచుతుంది. ఈ వర్చువల్ క్రెడిట్ కార్డ్‌ని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా వర్చువల్ క్రెడిట్ కార్డ్‌ను జారీ చేసే సమీప బ్యాంకులను సందర్శించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కలియుగాంతాన్ని సూచించే ఈ ఆలయం.. ఎన్నో రహస్యాలకు నెలవు..
కలియుగాంతాన్ని సూచించే ఈ ఆలయం.. ఎన్నో రహస్యాలకు నెలవు..
నన్ను అరెస్ట్ చేసి.. థర్డ్ డిగ్రీ ప్రయోగించే ఛాన్స్ ఉంది:
నన్ను అరెస్ట్ చేసి.. థర్డ్ డిగ్రీ ప్రయోగించే ఛాన్స్ ఉంది:
లేటు వయసులో పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ నటుడు.. నటి జ్యోతితో కలిసి
లేటు వయసులో పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ నటుడు.. నటి జ్యోతితో కలిసి
పేదింటి పిల్లలకు ఉచితంగా గొప్పచదువులు.. నవోదయకు దరఖాస్తు చేశారా?
పేదింటి పిల్లలకు ఉచితంగా గొప్పచదువులు.. నవోదయకు దరఖాస్తు చేశారా?
ఆ అలవాటు ఉంటే యమ డేంజర్ అంట.. ఇందుకే అంటారు న‌య‌నం ప్ర‌ధానం అని..
ఆ అలవాటు ఉంటే యమ డేంజర్ అంట.. ఇందుకే అంటారు న‌య‌నం ప్ర‌ధానం అని..
పోలింగ్ బూత్‌లో పబ్లిక్ టాయిలెట్‌పై అక్షయ్‌కు వృద్ధుడు ఫిర్యాదు
పోలింగ్ బూత్‌లో పబ్లిక్ టాయిలెట్‌పై అక్షయ్‌కు వృద్ధుడు ఫిర్యాదు
2024లో విడాకులు తీసుకున్న సెలబ్రెటీలు వీరే
2024లో విడాకులు తీసుకున్న సెలబ్రెటీలు వీరే
యూజీసీ- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2024 నోటిఫికేషన్‌
యూజీసీ- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2024 నోటిఫికేషన్‌
ఆ వీడియోలపై జాగ్రత్త తప్పనసరి.. స్పష్టం చేసిన ఆర్‌బీఐ
ఆ వీడియోలపై జాగ్రత్త తప్పనసరి.. స్పష్టం చేసిన ఆర్‌బీఐ
తన KCR సినిమా పోస్టర్స్ తనే గోడ మీద అతికిస్తోన్న రాకింగ్ రాకేష్
తన KCR సినిమా పోస్టర్స్ తనే గోడ మీద అతికిస్తోన్న రాకింగ్ రాకేష్