LIC Police: పిల్లల చదువుల కోసం అదిరిపోయే స్కీమ్‌.. ఎల్‌ఐసీ నుంచి అద్భుతమైన పథకం

ఈ రోజుల్లో భారతదేశంలో అనేక రకాల ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే దేశంలో ఇప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రజలు పోస్ట్ ఆఫీస్ పథకాలు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టడానికి..

LIC Police: పిల్లల చదువుల కోసం అదిరిపోయే స్కీమ్‌.. ఎల్‌ఐసీ నుంచి అద్భుతమైన పథకం
Lic Scheme
Follow us
Subhash Goud

|

Updated on: Apr 16, 2023 | 9:18 PM

ఈ రోజుల్లో భారతదేశంలో అనేక రకాల ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే దేశంలో ఇప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రజలు పోస్ట్ ఆఫీస్ పథకాలు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతున్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది పాలసీదారులను కలిగి ఉన్న ఎల్‌ఐసీకి ఎంతో ఆదరణ ఉంది.

ఎల్‌ఐసీ దేశంలోని ప్రతి విభాగానికి అనేక విభిన్న పథకాలను తీసుకువస్తుంది. పిల్లల కోసం ప్రత్యేకంగా కొన్ని పథకాలు రూపొందించబడ్డాయి. మీకు అలాంటి పాలసీ గురించి మీకు చెప్పబోతున్నాం. దీన్ని కొనుగోలు చేయడం ద్వారా మీ పిల్లల చదువుల టెన్షన్‌కు తెరపడుతుంది. ఈ పథకం పేరు ఎల్‌ఐసీ జీవన్ తరుణ్ పాలసీ. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఎంత రాబడిని పొందవచ్చో తెలుసుకోండి.

పిల్లల వయస్సు ఎంత ఉండాలి..?

ఎల్‌ఐసీ జీవన్ తరుణ్ పాలసీలో పెట్టుబడి పెట్టడానికి, పిల్లల కనీస వయస్సు 3 నెలలు, గరిష్టంగా 12 సంవత్సరాలు ఉండాలి. ఈ పథకం కింద పిల్లలకి 20 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు మొత్తం పెట్టుబడి పెట్టబడుతుంది. దీని తర్వాత 5 సంవత్సరాల వ్యవధిలో ఎలాంటి పెట్టుబడి ఉండదు. పిల్లవాడికి 25 సంవత్సరాలు నిండిన తర్వాత మొత్తం డబ్బును క్లెయిమ్ చేయవచ్చు. దీంతో పిల్లల చదువులు, పెళ్లి ఖర్చుల  టెన్షన్ కు తెరపడుతుంది.

ఇవి కూడా చదవండి

మీరు కనీస హామీ మొత్తం ఎంత పొందుతారు:

ఈ పాలసీలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఖచ్చితంగా కనీసం రూ.75,000 హామీ మొత్తం ప్రయోజనం పొందుతారు. అదే సమయంలో గరిష్ట మొత్తానికి ఎటువంటి పరిమితి నిర్ణయించబడలేదు. ఈ పథకం కింద, మీరు నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక, వార్షిక ప్రాతిపదికన ప్రీమియం డిపాజిట్ చేయవచ్చు. జీవన్ తరుణ్ పాలసీ అనేది పరిమిత చెల్లింపు పథకం అని గమనించాలి.

మెచ్యూరిటీపై ఎంత మొత్తం..

ఒక వ్యక్తి 12 సంవత్సరాల వయస్సులో పిల్లల కోసం ఈ పాలసీని కొనుగోలు చేసి, ప్రతిరోజూ చిన్న మొత్తంలో రూ.150 చేస్తే, అప్పుడు వార్షిక ప్రీమియం దాదాపు రూ.54,000 అవుతుంది. ఈ సందర్భంలో 8 సంవత్సరాలలో మొత్తం రూ.4.32 లక్షలు డిపాజిట్ చేయబడతాయి. దీనిపై రూ.2.47 లక్షలు బోనస్‌గా అందుకుంటారు. అటువంటి పరిస్థితిలో 25 సంవత్సరాల వయస్సులో అతనికి సుమారు 7 లక్షల రూపాయల అందుకుంటాడు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?