AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax: కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ విధానంలో పన్ను దాఖలు చేసేటప్పుడు గుర్తించుకోవాల్సిన విషయాలు

ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ ప్రారంభమైంది. ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులు ఆదాయపు పన్ను చెల్లించడం తప్పనిసరి. ప్రస్తుతం ఆదాయపు పన్ను రెండు వేర్వేరు పన్ను విధానాల ప్రకారం దాఖలు చేయబడింది..

Income Tax: కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ విధానంలో పన్ను దాఖలు చేసేటప్పుడు గుర్తించుకోవాల్సిన విషయాలు
Income Tax
Subhash Goud
|

Updated on: Apr 16, 2023 | 7:03 PM

Share

ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ ప్రారంభమైంది. ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులు ఆదాయపు పన్ను చెల్లించడం తప్పనిసరి. ప్రస్తుతం ఆదాయపు పన్ను రెండు వేర్వేరు పన్ను విధానాల ప్రకారం దాఖలు చేయబడింది. ఒకటి పాత ఆదాయపు పన్ను విధానం కాగా, రెండోది కొత్త ఆదాయపు పన్ను విధానం. అయితే ఈ సమయం నుంచి కొత్త ఆదాయపు పన్ను విధానం డిఫాల్ట్ విధానం. అటువంటి పరిస్థితిలో కొత్త ఆదాయపు పన్ను విధానంలో పన్ను దాఖలు చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

పన్ను విధానం:

2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు ప్రకటనలు చేశారు. ఈ ప్రకటనల ద్వారా ఆదాయపు పన్ను విధానంలో మార్పులను కూడా ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీనితో పాటు కొత్త ఆదాయపు పన్ను విధానంలో అనేక మార్పులు చేయబడ్డాయి. అటువంటి పరిస్థితిలో మీరు కొత్త ఆదాయపు పన్ను విధానంలో పన్నును ఫైల్ చేస్తే, మీరు 30% పన్ను కూడా చెల్లించవలసి ఉంటుంది.

ఆదాయపు పన్ను

వాస్తవానికి కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను స్లాబ్‌లు మార్చబడ్డాయి. దీని కింద రూ.3 లక్షల వార్షిక ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. దీని తర్వాత రూ.3-6 లక్షల వార్షిక ఆదాయంపై 5% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో రూ.6-9 లక్షల వార్షిక ఆదాయంపై 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీని తర్వాత రూ.9-12 లక్షల వార్షిక ఆదాయంపై 15% పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

పెట్టుబడిపై మినహాయింపు లేదు:

దీని తర్వాత ఎవరైనా వార్షిక ఆదాయం 12-15 లక్షల రూపాయలు ఉంటే, అటువంటి వ్యక్తులు 20 శాతం పన్ను చెల్లించాలి. మరోవైపు ఎవరైనా వార్షిక ఆదాయం రూ.15 లక్షల కంటే ఎక్కువ ఉంటే, అలాంటి వారు 30 శాతం పన్ను చెల్లించాలి. అదే సమయంలో కొత్త పన్ను విధానం నుంచి పన్ను దాఖలు చేసేటప్పుడు పన్ను చెల్లింపుదారులు ఈ విధానంలో ఎటువంటి పెట్టుబడికి మినహాయింపు ఉండదని గుర్తుంచుకోవాలి.

పన్ను చెల్లింపుదారుడు తన పెట్టుబడిపై మినహాయింపు పొందాలనుకుంటే..

పాత పన్ను విధానం ప్రకారం.. ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అతను తన పెట్టుబడిపై పన్ను చెల్లించేటప్పుడు మినహాయింపు పొందగలుగుతాడు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి