Car Price Hike: వాహనదారులకు షాక్.. మరోసారి ఆ కార్ల ధరలు పెంపు.. నాలుగు నెలల్లో మూడో సారి పెరుగుదల
దేశంలోని పలు కార్ల తయారీ కంపెనీలు దూకుడు ప్రవర్తిస్తున్నాయి. కార్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నాయి. దీంతో వాహనదారులకు మరింత భారం మారుతోంది. ఇక వచ్చే నెలలో కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లయితే మీపై..
దేశంలోని పలు కార్ల తయారీ కంపెనీలు దూకుడు ప్రవర్తిస్తున్నాయి. కార్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నాయి. దీంతో వాహనదారులకు మరింత భారం మారుతోంది. ఇక వచ్చే నెలలో కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లయితే మీపై మరింత భారం పడే అవకాశం ఉంది. దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ తన కార్ల ధరలను మరోసారి పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ధరలు మే 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. కంపెనీ తన కార్ల ధరల్లో సగటున 0.6 శాతం పెంచుతున్నట్లు సమాచారం. వివిధ మోడల్స్, వేరియంట్లకు అనుగుణంగా కారు ధరలు పెరగనున్నాయి.
కంపెనీ ధరలు ఎందుకు పెంచింది:
కార్ల ధరలు పెరగడానికి ఖర్చులు పెరగడమే కారణమని టాటా మోటార్స్ పేర్కొంది. గత కొన్ని రోజులుగా ప్రభుత్వం అమలు చేసిన BS6 ఫేజ్ 2 నియమం నుంచి కంపెనీ తన కార్లలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది. ఇంతకుముందు మొత్తం భారాన్ని కంపెనీ భరించేది. అయితే ఇప్పుడు దానిలో కొంత భాగాన్ని వినియోగదారులకు మోపేందుకు సిద్ధమైనట్లు తెలిపింది. ఈ నిర్ణయం తర్వాత టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్ వంటి కంపెనీ కార్ల ధరలు రూ.5.54 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెరగనున్నాయి. దీనితో పాటు పంచ్, నెక్సాన్, హారియర్, సఫారీ వంటి ఎస్‌యూవీ కార్ల ధరలు కూడా పెరగనున్నాయి.
గతంలో రెండుసార్లు ధరలు పెరిగాయి
2023 సంవత్సరం ప్రారంభంలో టాటా మోటార్స్ జనవరిలో మొదటిసారి కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇది ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వచ్చింది. ఆ సమయంలో రెగ్యులేటరీ మార్పులు, ఇన్‌పుట్ ఖర్చులు పెరగడమే కారణమంటోంది కంపెనీ. ఇది కాకుండా, టాటా మోటార్స్ తన వాణిజ్య వాహనాల ధరలను 5 శాతం పెంచింది. ఈ రేట్లు ఏప్రిల్ 1, 2023 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ విధంగా 2023 మొదటి నాలుగు నెలల్లో టాటా మోటార్స్ వాహనాల ధరలు 3 సార్లు పెరిగాయి.
కార్ల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
విశేషమేమిటంటే, ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా BS 6 ఫేజ్ 2 ప్రమాణాలు అమలు అమలు చేస్తోంది కేంద్రం. అటువంటి పరిస్థితిలో అన్ని కార్ల తయారీ కంపెనీలు తమ కార్లలో ఇటువంటి పరికరాలను అమర్చాలి.. తద్వారా కారు వల్ల ఎంత కాలుష్యం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఈ టెక్నాలజీ కారణంగా కారు ధర పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీలు ఇప్పుడు వినియోగదారులపై భారం మోపుతున్నాయి. ఈ సమయంలో కస్టమర్లు ఖరీదైన కారుతో పాటు ఖరీదైన EMI భారం కూడా రెట్టింపు అవుతుందని గమనించాలి. ఆర్‌బిఐ రెపో రేటును నిరంతరం పెంచడం వల్ల కార్ల రుణాలు ఖరీదైనవిగా మారాయి. అటువంటి పరిస్థితిలో, ఇప్పుడు మీరు కారు కొనడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి