- Telugu News Photo Gallery Jackpot for senior citizens scss small saving scheme interest rate hike Telugu News
సీనియర్ సిటిజన్లకు సూపర్ న్యూస్.. SCSS వడ్డీ రేటుపెరిగింది..! భారీగా నెలవారీ రాబడి..
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ( SCSS ) ఖాతా అనేది రిటైర్మెంట్-బెనిఫిట్స్ ఖాతా. ఈ పథకానికి భారత ప్రభుత్వ మద్దతు ఉంది. తాజాగా కేంద్రప్రభుత్వం ఈ పథకాన్ని మరింత పెంచింది.
Updated on: Apr 15, 2023 | 11:58 AM

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్: సీనియర్ సిటిజన్స్ కోసం అతి ముఖ్యమైన సందేశం ఇది. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు పైబడిన సీనియర్ సిటిజన్లు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ( SCSS ) ఖాతా అనేది రిటైర్మెంట్-బెనిఫిట్స్ ఖాతా.

SCSS భారతదేశంలోని సీనియర్ సిటిజన్లకు సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా చెప్పొచ్చు. ఇది స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం సురక్షితం. ఖాతాను దేశవ్యాప్తంగా ఎక్కడికైనా బదిలీ చేసుకోవచ్చు.

2023-24 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పెట్టుబడి పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.

ఏప్రిల్ 2023తో ముగిసే త్రైమాసికంలో ప్రభుత్వం చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను 70 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది.

కనీస డిపాజిట్ రూ. 1000 లేదా రూ. 1000 మల్టిపుల్స్ ఎవరైనా తమ జీవిత భాగస్వామితో వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా ఖాతాను తెరవవచ్చు. ఖాతా తెరిచిన తేదీ నుండి ఐదేళ్ల తర్వాత కావాలనుకుంటే ఖాతాను మూసివేయవచ్చు. దానిని మూడు సంవత్సరాలు పొడిగించవచ్చు.

2023–24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) వడ్డీ రేటు సంవత్సరానికి 8.2% (ఏప్రిల్-జూన్). పెట్టుబడి పెట్టిన డబ్బు త్రైమాసిక వడ్డీ చెల్లింపులకు లోబడి ఉంటుంది. ఏప్రిల్ నుంచి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేటు 8 శాతం నుంచి 8.2 శాతానికి పెరిగింది.





























