UPI Payment Service: ఆ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త.. క్రెడిట్ కార్డుతో కూడా యూపీఐ సేవలు
తాజాగా క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ సేవలను అందిస్తున్నట్లు ప్రముఖ బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రకటించింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లు ఇప్పుడు క్రెడిట్ కార్డ్‌తో యూపీఐ లావాదేవీ ఎంపికను ఎంచుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ కలిగి ఉన్న కోటక్ కస్టమర్‌లు తమ డబ్బును రోజువారీ యూపీఐ లావాదేవీ సేవల కోసం ఉపయోగించవచ్చు.
భారతదేశంలో నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్‌కు అలవాటు చేసుకున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్‌పీసీఐ ద్వారా కూడా యూపీఐ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో ప్రజలు కూడా ఎక్కువ శాతం యూపీఐ సేవలను వినియోగించుకుంటున్నారు. యూపీఐ సేవలు సాధారణంగా బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును పంపుకోడానికి లేదా రిసీవ్ చేసుకోవడానికి ఉంటుంది. అయితే తాజాగా క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ సేవలను అందిస్తున్నట్లు ప్రముఖ బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రకటించింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లు ఇప్పుడు క్రెడిట్ కార్డ్‌తో యూపీఐ లావాదేవీ ఎంపికను ఎంచుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ కలిగి ఉన్న కోటక్ కస్టమర్‌లు తమ డబ్బును రోజువారీ యూపీఐ లావాదేవీ సేవల కోసం ఉపయోగించవచ్చు. అయితే కేవలం రూపే క్రెడిట్ కార్డుదారులకు మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ నుంచి రూపే క్రెడిట్ కార్డ్ బీమ్, పేటీఎం, ఫోన్‌పే, ఫ్రీచార్జ్, పేజాప్‌తో సహా కొన్ని యూపీఐ యాప్‌లతో ఉపయోగించవచ్చు. ఇప్పుడు కోటక్ మహీంద్రా బ్యాంక్ వినియోగదారులు తమ రూపే క్రెడిట్ కార్డ్‌ని నిర్దిష్ట యూపీఐ యాప్‌లతో లింక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెల్లింపులు చేయడానికి మీరు బ్యాంక్ ఖాతాను ఉపయోగించే విధంగానే మీరు యూపీఐని ఉపయోగించవచ్చు. మీ రూపే క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బు డెబిట్ అవుతుంది. రూపే కార్డుల ద్వారా యూపీఐ సర్వీస్ గతేడాది ప్రారంభించారు. ముఖ్యంగా సమీపంలోని స్టోర్‌లో మీరు ఇప్పుడు క్రెడిట్ కార్డ్‌ని స్కాన్ చేయడం ద్వారా లావాదేవి జరుపవచ్చు.
కోటక్ క్రెడిట్ ద్వారా యూపీఐ సేవలను పొందడం ఇలా
- స్టెప్-1: ముందుగా బీమ్ యాప్‌ను తెరవాలి. లింక్డ్ బ్యాంక్ అకౌంట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- స్టెప్-2: ప్లస్ ఎంపికపై క్లిక్ చేసి ఖాతాను జోడించు అనే ఎంపికను ఎంచుకోవాలి. అక్కడ క్రెడిట్ కార్డ్ ఎంపికపై నొక్కాలి.
- స్టెప్-3: క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకున్న తర్వాత మొబైల్ నంబర్, క్రెడిట్ కార్డ్ చెల్లుబాటు, ఇతర ఎంపికలు వంటి అడిగే వివరాలను అందించాలి.
- స్టెప్-4: అనంతరం మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీని వస్తుంది. తర్వాత ఓటీపీని నమోదు చేసి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.
- స్టెప్-5: తర్వాత పిన్ని సృష్టించాలి. అనంతరం మీ క్రెడిట్ కార్డ్‌లోని మొత్తాన్ని హ్యాపీగా ఉపయోగించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..