Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Property Aadhaar Link: ఇక మిగిలింది ఇదేనేమో.. ఇక ఆస్తులతో ఆధార్ అనుసంధానం?

ఆధార్‌.. ఇదో ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. ఆధార్‌ లేనిది ఏ పని జరగదు. ఆధార్‌ను అన్ని పత్రాలను అనుసంధానం చేయడం జరుగుతోంది. పాన్‌ కార్డు నుంచి ఓటర్‌ ఐడి కార్డు వరకు ఇలా మన దగ్గర ఉండే డాక్యుమెంట్లతో అనుసంధానం చేయాలని కేంద్రం సూచిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆస్తులకు కూడా ఆధార్‌ లింక్‌ చేయాలని ఢిల్లీ..

Property Aadhaar Link: ఇక మిగిలింది ఇదేనేమో.. ఇక ఆస్తులతో ఆధార్ అనుసంధానం?
Aadhaar Link
Follow us
Subhash Goud

|

Updated on: Apr 18, 2023 | 8:56 AM

ఆధార్‌.. ఇదో ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. ఆధార్‌ లేనిది ఏ పని జరగదు. ఆధార్‌ను అన్ని పత్రాలను అనుసంధానం చేయడం జరుగుతోంది. పాన్‌ కార్డు నుంచి ఓటర్‌ ఐడి కార్డు వరకు ఇలా మన దగ్గర ఉండే డాక్యుమెంట్లతో అనుసంధానం చేయాలని కేంద్రం సూచిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆస్తులకు కూడా ఆధార్‌ లింక్‌ చేయాలని ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. దేశ పౌరుల స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలనుకోవడం మంచి విషయమని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై సోమవారం కేంద్రం నుంచి సమాధానం కోరింది కోర్టు. ఈ పిటిషన్‌ను విచారించిన చీఫ్‌ జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్‌ యశ్వంత్‌ వర్మలతో కూడిన ధర్మాసనం.. ఈ అంశంలో నాలుగు వారాల్లో ప్రతిస్పందన తెలియజేయాలని కేంద్ర ఆర్థిక, న్యాయ, గృహ-పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి శాఖలకు సూచించింది. అయితే అవినీతి, నల్లధనం, బినామీ చెల్లింపులను అరికట్టేందుకు ఆధార్‌తో అనుసంధానం చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తదుపరి విచారణ జూలై 18వ తేదీకి వాయిదా వేసింది.

అయితే దేశంలో అవినీతిని కట్టడి చయడంతో పాటు బినామీ ఆస్తులను జప్తు చేయడం ప్రభుత్వం బాధ్యత అని న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు.. ఇది మంచి అంశమని, వీటిపై మరిన్ని స్పందనలు రావాలని అభిప్రాయపడింది. కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ చేతన్‌ శర్మతోపాటు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్‌ కౌన్సిల్‌ మనీశ్‌ మోహన్‌లు కూడా ఇది ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు.

ఇందుకు సంబంధించి ఢిల్లీ సర్కార్‌ 2019లోనే తన అభిప్రాయాన్ని తెలిపింది. ఆధార్‌ అనేది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్‌, ల్యాండ్‌ మ్యుటేషన్‌లకు గుర్తింపు పత్రంగా మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది. కేవలం ఐచ్ఛికం మాత్రమేనని.. ఇది తప్పనిసరి అని చెప్పడానికి చట్టంలో ఎటువంటి నిబంధన లేదని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి