Post Office Scheme: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌.. ఇందులో చేరితే నెలకు రూ.8000

దేశంలో రకరకాల ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీమ్‌లు చాలా ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చేలా ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి. గతంలో ఉత్తరాలు, ఇతర వాటికి పరిమితంగా ఉండే పోస్టాఫీసుల్లో ఇప్పుడు రకరకాల స్కీమ్‌లో అందుబాటులో ఉన్నాయి. కేంద్రం ప్రజలకు అన్ని రకాల పొదుపు పథకాలను అందించేలా..

Post Office Scheme: పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌.. ఇందులో చేరితే నెలకు రూ.8000
Post Office Scheme
Follow us
Subhash Goud

|

Updated on: Apr 18, 2023 | 7:09 AM

దేశంలో రకరకాల ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీమ్‌లు చాలా ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చేలా ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి. గతంలో ఉత్తరాలు, ఇతర వాటికి పరిమితంగా ఉండే పోస్టాఫీసుల్లో ఇప్పుడు రకరకాల స్కీమ్‌లో అందుబాటులో ఉన్నాయి. కేంద్రం ప్రజలకు అన్ని రకాల పొదుపు పథకాలను అందించేలా చర్యలు చేపట్టింది. ప్రతి నెల రాబడి వచ్చే పథకాలు పోస్టాఫీసుల్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం బడ్డెట్‌ 2023లో మధ్య తరగతి ప్రజలకు మహిళల కోసం కొత్త స్కీమ్ ప్రకటించడంతో పాటు పలు స్కీమ్‌లలో ఉన్న పెట్టుబడి పరిమితులను కూడా పెంచింది. అధిక మొత్తంలో పొదుపు చేయాలనుకునేవారికి మంచి అవకాశం లభిస్తోంది. ఇందులో భాగంగా మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌లో ఉండే పెట్టుబడి పరిమితిని పెంచింది.

ఈ స్కీమ్‌లో గతంలో రూ.4.5 లక్షల లిమిట్‌ ఉండేది. దానిని రూ.9 లక్షల పెంచుతున్నట్లు బడ్జెట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జాయింట్‌ అకౌంట్‌ అయితే రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్‌మెంట్‌ చేయవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ సమయం ఐదేళ్లు.

ఎలాంటి రిస్క్‌ లేని స్కీమ్‌:

ఈ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ను అధికంగా సీనియర్‌ సీటిజన్స్‌ వినియోగిస్తుంటారు. ఎలాంటి రిస్క్‌ లేకుండా ప్రతి నెల డబ్బులు చేతికి అందుతాయి. ఈ స్కీమ్‌లో చేరిన వారికి 7.5 శాతం వడ్డీ వస్తుంది. ప్రతి నెల వడ్డీ డబ్బులు చెల్లిస్తారు. 10 ఏళ్లకుపైగా ఉన్నవారు ఈ స్కీమ్‌లో చేరేందుకు అర్హులు.

ఇవి కూడా చదవండి

ఎంత ఇన్వెస్ట్‌మెంట్‌కు ఎంత వస్తుంది..?

ఈ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌లో రూ.1 లక్ష ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే ప్రతి నెల రూ.592 వస్తాయి. అలాగే రూ.2 లక్షలు చేస్తే రూ.1183, రూ.5 లక్షలు ఇన్వెస్ట్‌ చేస్తే రూ.రూ.2958, అదే రూ.9 లక్షలు ఇన్వెస్ట్‌ చేసినట్లయితే రూ.5,325, రూ.10 లక్షలు ఇన్వెస్ట్‌ చేస్తే రూ.5,916 పైగా పొందవచ్చు.

ఇక గరిష్టంగా ఆ పథకంలో జాయింట్‌ అకౌంట్‌ తీసి ఇన్వెస్ట్‌ చేస్తే కూడా మంచి బెనిఫిట్‌ ఉంటుంది. ఈ అకౌంట్‌ ఉన్న వారు రూ. 15 లక్షలు ఇన్వెస్ట్‌ చేస్తే నెలకు రూ.8875 నెల నెలా అందుకోవచ్చు. ఈ స్కీమ్‌లో చేరాలనుకునేవారు మీ సమీపంలో ఉన్న పోస్టల్‌ శాఖను సందర్శించి అకౌంట్‌ తీయాల్సి ఉంటుంది. ఏవైనా సందేహాలు ఉన్నా.. ఇక్కడి సిబ్బందిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం కోసం అర్హత:

  • మీరు తప్పనిసరిగా భారతదేశ నివాసి అయి ఉండాలి.
  • 10 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్‌లు వారి పేర్లపై ఖాతాను తెరవవచ్చు.
  • 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మైనర్‌ల తరపున సంరక్షకుడు ఖాతాను తెరవవచ్చు.
  • గరిష్టంగా ముగ్గురు వ్యక్తులతో ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు.
  • మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి తరపున సంరక్షకుడు ఖాతాను తెరవవచ్చు.

ఎలాంటి పత్రాలు అవసరం:

  • దరఖాస్తు ఫారమ్
  • గుర్తింపు రుజువు: ఆధార్ కార్డ్/ఓటర్ ID/పాస్‌పోర్ట్ మొదలైనవి.
  • చిరునామా రుజువు: తాజా కరెంటు బిల్లులు/పాస్‌పోర్ట్/పాన్ కార్డ్ మొదలైనవి.
  • పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు

నెలవారీ వడ్డీ ఎలా లెక్కిస్తారు?

  • ఉదాహరణకు పెట్టుబడి మొత్తం రూ.5 లక్షలు.
  • వార్షిక వడ్డీ రేటు 7.50%
  • పదవీకాలం 5 సంవత్సరాలు.
  • నెలవారీ వడ్డీ రూ.2,958 అవుతుంది. 5 సంవత్సరాల కాలవ్యవధికి వచ్చే మొత్తం వడ్డీ రూ.1,79,100 అవుతుంది

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి