- Telugu News Photo Gallery Business photos Here is the Mukesh Ambani Luxury Car Collection, check list
Mukesh Ambani Cars: అంబానీ వాడే లగ్జరీ కార్లు ఇవే.. ధర చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
లగ్జరీ కార్లంటే మనకు గుర్తొచ్చేవి ఏమిటి? బెంజ్, బీఎండబ్ల్యూ, ఫెర్రారీ, రోల్స్ రాయిస్ వంటి కంపెనీలకు చెందిన కార్లు ఠక్కున మైండ్ లో మెదలుతాయి. అయితే వాటి ధర మాత్రం ఎక్కడో ఆకాశంలో ఉంటాయి. అత్యంత సంపన్న కుటుంబాల వారు మాత్రమే ఆ కార్లను వాడగలరు. మన దేశంలో అత్యంత సంపన్నుల్లో ముఖేష్ అంబానీ ఒకరు. వారి లైఫ్ స్టైల్, ఆయన కుటుంబ సభ్యులు ధరించే వస్త్రాలు, అలాగే వారు వినియోగించే కార్లు అన్నింటిపైనా ప్రజలకు ఆసక్తి ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే అంబానీకి చెందిన యాంటిల్లా గ్యారేజీలో 150 కంటే ఎక్కువ లగ్జరీ కార్లు అక్కడ పార్క్ చేసి ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. వాటిల్లో కొన్ని టాప్ లగ్జరీ కార్లను మీకు పరిచయం చేస్తున్నాం. మీరూ ఓ లుక్కేయండి..
Updated on: Apr 19, 2023 | 6:30 PM

రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్ హెడ్(Rolls-Royce Phantom Drophead (Convertible)).. ముఖేష్ అంబానీ గ్యారేజీలో ఒకటి కాదు, రెండు రోల్స్ రాయిస్ ఉన్నాయి. ఈ ఫాంటమ్ కారు ముఖేష్ అంబానీ చిన్న కొడుకు సొంతం. ఇది కన్వర్టిబుల్ కూపే, 435bhp, 720Nm టార్క్ ఉత్పత్తి చేసే 6.75-లీటర్ V12 ఇంజన్‌తో వస్తుంది. దాని పనితీరు విషయానికొస్తే, ఫాంటమ్ 5 సెకన్లలోపు గంటకు 0-100 కిమీ వేగాన్ని అందుకోగలదు. దీని ధర అక్షరాల రూ. 7.6 కోట్లు.

బెంట్లీ బెంటాయ్గా (Bentley Bentayga) బెంట్లీ మార్క్యూ లైనప్‌లో ఉన్న ఏకైక ఎస్యూవీఇది. అంబానీ గ్యారేజీలో ఉన్న ఈ కారు ఆకాష్ అంబానీకి చెందినదిగా చెబుతారు. ఇది బ్రిటిష్ గ్రీన్ షేడ్‌లో ఉంది. అద్దాలు వాటి తలుపులపై కార్బన్-ఫైబర్ ఫినిష్ను కలిగి ఉంటాయి. 6.0-లీటర్ V12 ఇంజన్ 600bhp, 900 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ. 3.85 కోట్లు.

మెర్సిడెస్ మేబ్యాక్ బెంజ్ ఎస్660 గార్డ్(Mercedes Maybach Benz S660 Guard ).. జెడ్ కేటగిరీ భద్రత లభించే మరో హై ఎండ్ కారు మెర్సిడెస్ మేబ్యాక్ బెంజ్ ఎస్660 గార్డ్. ఇది సాధారణంగా రాజ కుటుంబీకులు, ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల వద్ద కనిపిస్తుంది. ఈ మేబ్యాక్‌లో 6-లీటర్ V12 ఇంజన్ కూడా ఉంది, ఇది 523bhp, 830Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 7.9 సెకన్లలో అందుకుంటుంది. దీని ధర రూ. 10.5 కోట్లు.

ఫెరారీ ఎఫ్90 స్ట్రాడేల్(Ferrari SF90 Stradale).. ఇది 2019లో ఫెరారీ ప్రారంభించిన మొట్టమొదటి హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు. ఈ కారులోని 4-లీటర్ V8 ఇంజన్ 769bhp, 800Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ. 7.50 కోట్లు

బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్(Bentley Continental Flying Spur).. ఇది దూర ప్రయాణాలకు అనువైన కారు. ప్రయాణికులు విలాసవంతంగా ఉండేలా చేస్తుంది. దీనిలో 626bhp, 820Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 6-లీటర్ W12 ఇంజిన్ ఉంటుంది. దీని ధర రూ. 3.69 కోట్లు

ఆస్టన్ మార్టిన్ర్యాపిడ్(Aston Martin Rapide): అంబానీకి చెందిన ర్యాపిడ్ కారు కొన్ని సంవత్సరాల క్రితం ముంబైలో క్రాష్ అయినప్పుడు వార్తల్లో నిలిచింది. ఈ రాపిడ్ కారులో 5.9-లీటర్ V12 ఇంజిన్ ఉంటుంది. ఇది 470bhp, 600Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ. 3.88 కోట్లు.

బీఎండబ్ల్యూ 760 ఎల్ఐ ఆర్మర్డ్(BMW 760 Li Armoured).. ఈ బుల్లెట్ ప్రూఫ్ BMW అంబానీ సురక్షితమైన కార్లలో ఒకటి. ఈ కారు Z- కేటగిరీ భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. ఓ నివేదిక ప్రకారం, ముకేష్ అంబానీ జర్మనీ నుంచి భారతదేశానికి కారును తీసుకురావడానికి 300% దిగుమతి పన్ను చెల్లించారు. ఆ పైన, దీనిని రిజిస్టర్ చేసేందుకు మరో రూ. 1.6 కోట్లు ఖర్చు చేశారు. ఈ ప్రత్యేక బిమ్మర్‌లో 6-లీటర్ V12 పెట్రోల్ ఇంజన్, 549bhp 750Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ. 8.5 కోట్లుగా ఉంది.




