Business Idea: జీవితంలో పైకి రావాలంటే జస్ట్ ఈ బిజినెస్ ట్రై చేయండి చాలు.. రూ.లక్షల్లో ఆదాయం మీ సొంతం..
నిరుద్యోగ యువత ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ సమయాన్ని వృధా చేసుకునే బదులు మంచి వ్యాపారం చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది.

నిరుద్యోగ యువత ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ సమయాన్ని వృధా చేసుకునే బదులు మంచి వ్యాపారం చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది. ముఖ్యంగా గ్రామీణ యువత వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు చేయడం ద్వారా నిరంతరం ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పాల వ్యాపారం చేయడం ద్వారా చక్కటి ఆదాయం ఉండవచ్చు. పాల వ్యాపారంలో సరైన గిట్టుబాటు ధర రాదని రైతులు ఆందోళన చేస్తున్న మాట వాస్తవమే కానీ టెక్నాలజీని ఉపయోగించి మంచి మార్కెటింగ్ టెక్నిక్స్ ను వాడినట్లయితే చక్కటి ఆదాయం పొందే వీలుంది. వినూత్న పద్ధతిలో డైరీ ఫార్మ్ నడపడం ద్వారా నిరంతరం లాభాలు వచ్చే అవకాశం ఉంది. . అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాధారణంగా డైరీ ఫాం అంటే రైతులు లైవ్ స్టాక్ గేదెలు, ఆవులను పెంచడం ద్వారా పాలను ఉత్పత్తి చేసి వాటిని నేరుగా కస్టమర్లకు, లేదా డైరీ ఉత్పత్తి సంఘాలకు విక్రయిస్తారు. ఇది సాంప్రదాయంగా చేసే పద్ధతి ఇందులో రైతులు కేవలం పశుపోషణ వరకే పరిమితం అవుతారు. అనంతరం ఆ పశువుల నుంచి పాలను సేకరించి, డైరీ సంఘాలకు విక్రయిస్తాడు. అయితే సాధారణంగా రైతులు ఇక్కడే నష్టపోతుంటారు. పాల ధరను డైరీ ఉత్పత్తిదారులు నిర్ణయిస్తుంటారు. ఫలితంగా గిట్టుబాటు ధర లభించక రైతు నష్టపోవడం మనం ఇంతకాలం చూస్తూ ఉన్నాం. నేటి పరిస్థితుల్లో ఒక లీటర్ గేదె పాలను ఉత్పత్తి చేయాలంటే రైతుకి సుమారు 100 రూపాయలకు పైగా ఖర్చవుతుంది. కానీ మార్కెట్లో ఆ ధర వద్ద పాలకు ఆ రేటు లభించడం లేదు.
డైరీ సంస్థలు మాత్రం పాలను సేకరించి దాని నుంచి ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తుంటారు. తద్వారా వారికి అధిక మొత్తంలో లాభం వస్తుంది. రైతుకు మాత్రం పెట్టుబడి కూడా లభించడం లేదు. ముఖ్యంగా పెరుగుతున్న దాణా ఖర్చు, అలాగే పశువులకు ఇచ్చే మందులు పెరుగుతున్న వ్యాధులు కూడా రైతుకు ఖర్చులు పెంచుతున్నాయి. ముఖ్యంగా రైతుల వద్ద పాలను నిల్వ చేసేందుకు ఎలాంటి సదుపాయాలు ఉండటం లేదు. ఫలితంగా రైతు ఎంతో కొంతకి పాలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓవైపు మార్కెట్లో పాలకు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ రైతులకు మాత్రం ఎలాంటి సహకారము గిట్టుబాటు ధర లభించడం లేదు. మరి ఈ బిజినెస్ లో లాభం ఎలా వస్తుంది అని సందేహం మీకు కలగవచ్చు.




వినూత్నమైన టెక్నాలజీని ఉపయోగించి మీరు బిజినెస్ చేస్తే మాత్రం డైరీ బిజినెస్ లో మంచి లాభం పొందవచ్చు. పాల ఉత్పత్తిలో పాలను నిల్వ చేయకపోవడం వల్లనే రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. అందుకే మీరు పాలను నిల్వ చేసేందుకు చిల్లింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసుకుంటే మంచిది. . అదేవిధంగా పాల ఉత్పత్తులను తయారు చేసేందుకు పాల నుంచి వెన్న విడదీసే యంత్రాలను ఇండియా మార్ట్ వెబ్సైట్లో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. వీటి ధర సుమారు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటాయి. రూ. 50 లక్షల మూల పెట్టుబడితో మీరు వివిధ యంత్రాలను కొనుగోలు చేసి డైరీ ఫార్మ్ స్థాపిస్తే చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా పాలను ప్యాకెట్లను, టెట్రా ప్యాకుల్లోనూ ప్యాక్ చేసి, నేరుగా కస్టమర్లకు విక్రయించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది.
వీలైతే ఆండ్రాయిడ్ యాప్ ద్వారా కూడా మీరు ఆర్డర్లను సేకరించి నేరుగా కస్టమర్లకు పాలను డెలివరీ చేసినట్లయితే మంచి ఆదాయం పొందే వీడు ఉంది. అలాగే పాల ఉత్పత్తులైన వెన్న, నెయ్యి, పెరుగు, బట్టర్ మిల్క్, లస్సి, అదేవిధంగా ఐస్ క్రీమ్ తయారు చేసి విక్రయించినట్లయితే మరింత లాభం పొందే వీలుంది. తద్వారా మీరు నష్టపోకుండా, చక్కటి ఆదాయం పొందవచ్చు. ఒకవేళ పెద్ద ఎత్తున మీరు డైరీ ఉత్పత్తులను తయారు చేయలేకపోతే,కేవలం పాలు, పెరుగు, నెయ్యి ప్యాక్ చేసి నేరుగా కస్టమర్లకు విక్రయించడం ద్వారా చక్కటి ఆదాయం పొందవచ్చు. తద్వారా మీ పాలకు మంచి గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..