Business idea: పెట్టుబడి తక్కువ.. లాభాలు ఎక్కువ.. నెలకు రూ. 70,000 వరకూ సంపాదించే సూపర్ బిజినెస్ ఐడియా..
ఒకేసారి పెట్టుబడి.. అది కూడా స్పల్ప మొత్తంలో కేవలం రూ. 5లక్షలు మాత్రమే పెట్టి.. కనీసం నెలకు రూ. 60,000 నుంచి 70,000 వరకూ సంపాదించే బస్ట్ బిజినెస్ ఒకటి ఉంది. అదే ఏటీఎం ఫ్రాంచైజీ.

వ్యాపారం అనగానే చాలా మంది భయపడతారు. అధికంగా పెట్టుబడి పెట్టాలని.. రిస్క్ అని ఆలోచిస్తుంటారు. అయితే అతి తక్కువ పెట్టుబడితో.. నెలవారీ అధిక రాబడులు వచ్చే బిజినెస్ ఐడియాలు చాలానే ఉన్నాయి. అయితే ఒకేసారి పెట్టుబడి పెట్టి అది కూడా స్పల్ప మొత్తంలో కేవలం రూ. 5లక్షలు మాత్రమే పెట్టి.. కనీసం నెలకు రూ. 60,000 నుంచి 70,000 వరకూ సంపాదించే బస్ట్ బిజినెస్ ఒకటి ఉంది. అదే ఏటీఎం ఫ్రాంచైజీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఫ్రాంచైజీ అంటే..
ఏటీఎం మనకు సుపరిచితమైన పేరే. రోజూ ఏదో ఒక సమయంలో దీనిని మనం వినియోగిస్తూ ఉంటాం. తరచూ మన కంటికి కనిపిస్తూనే ఉంటాయి.అయితే ఆయా బ్యాంకుల పేరుతో ఉండే ఈ ఏటీఎంలు బ్యాంకుల నిర్వహణలో ఉండవు. ఆ ఏటీఎంల నిర్వహణ బ్యాంకులు చేయవు. బయట వ్యక్తులు, సంస్థలకు కాంట్రాక్ట్ ఇస్తారు. ఆ సంస్థలు బయటి వ్యక్తులకు సబ్ కాంట్రాక్ట్ ఇస్తారు. వీరు వాటిని నిర్వహిస్తారు. మరీ ఆ కంట్రాక్ట్ పొందడం ఎలా? అది లాభదాయకమేనా? దాని కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హతలేమిటి? అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇలా పొందాలి..
ఇక బ్యాంకు సంబంధించిన ఏటీఎం ఫ్రాంచైజీని పొందడానికి ఆ బ్యాంకు కాంట్రాక్ట్ కలిగిన కంపెనీ అధికారిక వెబ్ సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలి. ఉదాహరణకు మీరు ఎస్బీఐ ఏటీఎం ఫ్రాంచైజ్ కావాలనుకుంటే మీరు ఇండియా వన్ ఏటీఎం, టాటా ఇండిక్యాష్, లేదా ముత్తూట్ ఏటీఎం వంటి సంస్థలకు దరఖాస్తు చేసుకోవాలి. ఇవి ఎస్బీఐతో పాటు హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ, పీఎన్బీ వంటి బ్యాంకులతో ఒప్పందాలు కలిగి ఉన్నాయి.
నిబంధనలు ఇవి..
- ఏటీఎం ఫ్రాంచైజీని పొందడానికి ఆయా సంస్థలు కొన్ని నిబంధనలు, షరతులు విధిస్తాయి. అవేంటో చూద్దాం..
- దరఖాస్తుదారుడికి తప్పనిసరిగా 50 నుంచి 80 అడుగుల విస్తీర్ణం కలిగి ఉండాలి.
- ఇది ఇతర ఏటీఎంల నుండి కనీసం 100 మీటర్ల దూరంలో ఉండాలి.
- ఏటీఎం క్యాబిన్ ఉండే ప్రదేశం జనాలకు కనిపించే విధంగా ఉండాలి.
- కనీసం 1కిలోవాట్ విద్యుత్ కనెక్షన్ అన్ని వేళలా అందుబాటులో ఉండాలి.
- క్యాబిన్ కాంక్రీట్ పైకప్పుతో శాశ్వత భవనంగా ఉండాలి.
అవసరమైన డాక్యూమెంట్స్ ఇవి..
- ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్
- రేషన్ కార్డు, కరెంటు బిల్లు
- బ్యాంక్ ఖాతా, పాస్ బుక్
- ఫోటోగ్రాఫ్, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్
- జీఎస్టీ సంఖ్యతో పాటు కంపెనీకి అవసరమైన ఆర్థిక పత్రాలు
పెట్టుబడి, సంపాదన ఇలా..
ఏటీఎం క్యాబిన్ ఏర్పాటుకు ఆమోదం పొందడానికి దరఖాస్తుదారులు రూ. 2 లక్షల సెక్యూరిటీ మొత్తాన్ని, రూ. 3 లక్షల వర్కింగ్ క్యాపిటల్‌ను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మొత్తం పెట్టుబడి దాదాపు రూ. 5 లక్షలు అవుతుంది. ఇది బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది. మీరు ఏటీఎం నుంచి ప్రతి నగదు లావాదేవీకి రూ. 8 కమిషన్ అందుకుంటారు. అలాగే ప్రతి నగదు రహిత లావాదేవీకి మీరు రూ. 2 పొందుతారు.
ఈ విషయంలో అప్రమత్తత అవసరం..
అయితే ఏటీఎం ఫ్రాంచైజీని అందించే వెబ్ సైట్ల పట్ల జాగ్రత్త వహించాలి. వాటిల్లో కొన్ని మోసపూరిత వెబ్‌సైట్‌లు ఉన్నాయి. మీరు పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్త వహించాలి. అధికారిక వెబ్‌సైట్‌కి మాత్రమే వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







