Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani Group: ఏపీలో రెండు కొత్త సిమెంట్‌ ప్లాంట్స్‌, డేటా సెంటర్‌.. ఆదాని గ్రూప్‌ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులే లక్ష్యంగా జగన్‌ ప్రభుత్వం గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమ్మిట్‌కు 25 దేశాల..

Adani Group: ఏపీలో రెండు కొత్త సిమెంట్‌ ప్లాంట్స్‌, డేటా సెంటర్‌.. ఆదాని గ్రూప్‌ కీలక ప్రకటన
Karan Adani
Follow us
Subhash Goud

|

Updated on: Mar 03, 2023 | 2:57 PM

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులే లక్ష్యంగా జగన్‌ ప్రభుత్వం గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమ్మిట్‌కు 25 దేశాల నుంచి హైకమిషనర్లు, 15వేల మంది ప్రతినిధులు, ఇండియా నుంచి 35మంది టాప్‌ ఇండస్ట్రియలిస్ట్‌లు, బిజినెస్‌ టైకూన్స్‌, కార్పొరేట్‌ దిగ్గజాలు, ఏడుగురు కేంద్ర మంత్రులు, వీవీఐపీలు పాల్గొన్నారు. సుమారు 7వేల మంది పోలీసులతో నగరమంతటా మోహరించింది. ప్రముఖ హోటళ్లలో 1500లకు పైగా షూట్స్‌ని బుక్‌ చేసింది ప్రభుత్వం.

ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్‌కు సంబంధించిన కీలక వార్త బయటకు వస్తోంది. అదానీ గ్రూప్ ఏపీలో రెండు కొత్త సిమెంట్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతోంది. దీనితో పాటు 15,000 మెగావాట్ల పునరుత్పాదక పవర్ ప్రాజెక్ట్‌ల పనులు జరుగుతాయని, డేటా సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు అదానీ పోర్ట్స్, సెజ్ లిమిటెడ్ సీఈఓ కరణ్ అదానీ శుక్రవారం వెల్లడించారు. ఇప్పుడు ఏపీలో కంపెనీ తన ఉనికిని రెట్టింపు చేయాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. అందుకోసం ఈ చర్యలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కరణ్ అదానీ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కృష్ణపట్నం, గంగవరంలో పనిచేస్తున్న 2 సీ పోర్ట్‌ల సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని గ్రూప్ యోచిస్తోందని అన్నారు. అయితే పెట్టుబడి మొత్తాన్ని వెల్లడించలేదు. అదానీ గ్రూప్ ఇప్పటికే రూ.20,000 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉంది. దీని ద్వారా 18,000 మందికి పైగా ప్రత్యక్ష, 54,000 పరోక్ష ఉద్యోగాలు కూడా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

కడప, నడికుడిలో ప్రతి సంవత్సరం మొత్తం 10 మిలియన్ టన్నుల సామర్థ్యంతో అదానీ గ్రూప్ సిమెంట్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతోందని అదానీ గ్రూప్ పోర్ట్ కంపెనీ సిఇఒ తెలిపారు. రాష్ట్రంతో పాటు విశాఖపట్నంలో కూడా 400 మెగావాట్ల డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.

ఆదాని గ్రూప్‌కు ఆంధ్రాలో అతిపెద్ద ఓడరేవు

ప్రస్తుతం అదానీ గ్రూప్‌కు ఆంధ్రప్రదేశ్‌లో రెండు అతిపెద్ద ప్రైవేట్ పోర్టులు ఉన్నాయని కరణ్ అదానీ తెలిపారు. వీటి పేర్లు కృష్ణపట్నం, గంగవరం. ఇది సంవత్సరానికి 100 మిలియన్ టన్నుల మొత్తం సామర్థ్యంతో నిర్వహిస్తున్నారు. రాబోయే 5 సంవత్సరాలలో వీటి సామర్థ్యాన్ని రెట్టింపు చేయడమే కాకుండా, ఈ పోర్టులను పారిశ్రామిక ఓడరేవు నగరాలుగా మార్చడానికి కూడా కృషి చేస్తున్నాము. రాబోయే కొన్నేళ్లలో అనంతపురం, కడప, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం 5 జిల్లాల్లో 15,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి