Sugar Price: చేదెక్కుతున్న పంచదార.. మూడు వారాలుగా పరుగులు పెడుతున్న ధర.. ఎందుకో తెలుసా..?

ప్రతి ఇంట్లో చక్కెర వాడకం చాలా ఉంటుంది. ఎందుకంటే ప్రతి రోజు టీతో పాటు వివిధ రకాల వంటకాల్లో చక్కెరను ఉపయోగిస్తుంటాము. ముఖ్యంగా స్వీట్లలో చక్కెర కావాల్సిందే. కానీ పంచదార ఇప్పుడు సామాన్యుడికి మరింత భారంగా మారుతోంది. ఎందుకంటే రోజురోజుకు ధర పెరిగిపోతోంది..

Sugar Price: చేదెక్కుతున్న పంచదార.. మూడు వారాలుగా పరుగులు పెడుతున్న ధర.. ఎందుకో తెలుసా..?
Sugar Price
Follow us

|

Updated on: Apr 18, 2023 | 12:51 PM

ప్రతి ఇంట్లో చక్కెర వాడకం చాలా ఉంటుంది. ఎందుకంటే ప్రతి రోజు టీతో పాటు వివిధ రకాల వంటకాల్లో చక్కెరను ఉపయోగిస్తుంటాము. ముఖ్యంగా స్వీట్లలో చక్కెర కావాల్సిందే. కానీ పంచదార ఇప్పుడు సామాన్యుడికి మరింత భారంగా మారుతోంది. ఎందుకంటే రోజురోజుకు ధర పెరిగిపోతోంది. అకాల వర్షాల కారణంగా, రాష్ట్రాలలో ముఖ్యంగా మహారాష్ట్ర, కర్నాటకలో దిగుబడి తగ్గడం, రికవరీ రేట్లు కారణంగా ప్రస్తుత సీజన్‌లో చక్కెర ఉత్పత్తి అంచనా గతంలో 35.5 మిలియన్ టన్నుల నుంచి ఇప్పుడు 33 మిలియన్లకు తగ్గింది. దీంతో చక్కెర ధర ఎగబాకుతోంది. చక్కెర ధరలు చేదుగా మారుతున్నాయి. గత మూడు వారాలుగా చక్కెర ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఇన్ని రోజుల్లో చక్కెర ధర 7% పెరిగింది. తక్కువ ఉత్పత్తి – అధిక డిమాండ్ కారణంగా చక్కెర ధరలు చేదుగా మారాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో చక్కెర దాదాపు 48 రూపాయలకు అందుబాటులో ఉంది. పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాబోయే రోజుల్లో చక్కెర ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. FY 23లో చక్కెర ఉత్పత్తి మునుపటి ఆర్థిక సంవత్సరం కంటే తక్కువగా ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. 23 ఆర్థిక సంవత్సరంలో 33 మిలియన్ టన్నుల చక్కెర ఉత్పత్తి అయిందని అంచనా.

దేశంలో విశీయ వినియోగం 27.5 మిలియన్లు, ఎగుమతులు 6 మిలియన్లు అని పేర్కొంటూ, ప్రభుత్వం తదుపరి ఎగుమతులను అనుమతించే అవకాశం లేదని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఇది ముగింపు ఇన్వెంటరీ దాదాపు 6.5 మిలియన్ల వద్ద స్థిరంగా ఉంటుందని అంచనా వేసింది. భారతదేశంలో చక్కెర ధరలు గత 10 రోజుల్లో 11% పెరిగాయి. దేశీయ ధరలు కూడా గత 10 రోజుల్లో దాదాపు 7-8% పెరిగాయి. వచ్చే 4-6 నెలల్లో % ధర పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles