Business Idea: తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచే పని చేస్తూ నెలకు వేలల్లో సంపాదించండి! టాప్ 4 బిజినెస్‌లు
చాలా మందికి ఉద్యోగం కన్నా సొంత వ్యాపారం చేయాలని ఉంటుంది. అలాంటి వారికి తక్కువ పెట్టుబడితో, ఇంటి నుంచే పనిచేస్తూ నెలకు వేలల్లో ఆదాయం పొందే బిజినెస్ ఐడియాలు ఎన్నో ఉన్నాయి. ట్రాన్స్‌లేషన్ సేవలు, ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ రివ్యూయింగ్ వంటివి ఇంటి నుండి సులభంగా ప్రారంభించి మంచి లాభాలు పొందవచ్చు.

చాలా మందికి ఉద్యోగం చేయడం ఇష్టముండదు. వ్యాపారం చేయడం లేదా తమకు వచ్చిన వచ్చిన పనిని తమకు నచ్చినట్లు, నచ్చిన సమయానికి చేయడానికి ఇష్టపడతారు. అదే మైండ్‌సెట్ మీకూ ఉంటే.. మీరే సొంతంగా వ్యాపారం ప్రారంభించండి. తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచే పనిచేస్తూ నెలకు వేలల్లో ఆదాయం పొందే కొన్ని బిజినెస్ ఐడియాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ట్రాన్స్‌లేషన్
ఇన్‌ఫర్మెషన్ షేరింగ్ పెరగడంతో డాక్యుమెంట్లు, వెబ్‌సైట్లు, పుస్తకాలను ఒక భాష నుండి మరో భాషలోకి అనువదించే వారి అవసరం కూడా అదే స్థాయిలో పెరిగింది. మీరు ఒకటి కంటే ఎక్కువ భాషల్లో నిపుణులైతే ఈ రంగంలో చాలా అవకాశాలు ఉన్నాయి. పైగా ఇప్పుడు అందరికీ ఇంగ్లీష్ ఎలాగో వస్తోంది. దానికి తోడు మీ మాతృ భాషలో మరింత పట్టు సంపాదించి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేస్తూ మంచి ఆదాయం పొందవచ్చు. గూగుల్, లింక్డిన్, నౌకరీల్లో లింగిస్టిక్ సేవల గురించి సర్చ్ చేస్తే మీకు పని దొరుకుతుంది.
సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్
క్విక్ బుక్స్, అడోబ్ ఫోటోషాప్ లేదా ఎంఎస్ ఎక్సెల్ వంటి సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లను ఇతరులకు నేర్పించడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. దీని కోసం ట్రైనింగ్ సెంటర్ తెరవాల్సిన అవసరం లేదు. కేవలం ఆన్‌లైన్‌లో కూడా మీరు ఈ ట్రైనింగ్ ఇవ్వొచ్చు. దీనికి ఎలాంటి పెట్టుబడి కూడా అవసరం లేదు.
ప్రొఫెషనల్ రివ్యూయర్
ఇదేంటి ఎప్పుడూ వినలేదే అన్నట్లు ఉందా.. బట్ ఇది కూడా మంచి ఆదాయం ఇచ్చే ఇన్‌కమ్ సోర్స్. నూతన ఉత్పత్తులు లేదా సేవల గురించి కంపెనీలు నిజాయితీతో కూడిన రివ్యూలను కోరుకుంటాయి. వాటిని వాడి చూసి, వాటి లాభనష్టాలను వివరిస్తూ కంటెంట్ రాయడం ద్వారా కంపెనీల నుండి నగదు లేదా బహుమతులు పొందొచ్చు.
ఈవెంట్ ప్లానింగ్…
దేశ వ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట వేడుకలు, పండగలు జరుగుతూనే ఉంటాయి. నగరాల్లో, పట్టణాల్లో వేడుక ఏదైనా సరే, అది పద్ధతిగా జరగాలని కోరుకుంటారు. మీకు ప్లానింగ్, మేనేజ్మెంట్ నైపుణ్యం ఉంటే, చిన్నపాటి పుట్టినరోజు వేడుకలు, నిశ్చితార్థాలు లేదా కార్పొరేట్ మీటింగ్స్‌ను ఆర్గనైజ్ చేసే బాధ్యత తీసుకోవచ్చు. వెళ్లి పనిచేయాల్సిన అవసరం లేకుండా కేవలం ప్లాన్‌ను డిజైన్ చేసి ఇచ్చినా ఎంతో కొంత ఆదాయం వస్తుంది. లేదా పూర్తిగా మారే ఈవెంట్ ఆర్గనైజింగ్ బాధ్యత తీసుకుంటే ఇంకా పెద్ద మొత్తంలో ఆదాయం పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
