Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khammam: బిగ్ బ్రేకింగ్.. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై హైకోర్ట్ స్టే

ఖమ్మంలో స్టాట్యూ కాంట్రవర్సీ కాక రేపుతోంది. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా.. శ్రీకృష్ణుడు రూపంలో.. 54 అడుగుల ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో... ఈ కార్యక్రమం జరుగుతుండగా.. తానా సభ్యులు, ఎన్నారైలు, పారిశ్రామిక వేత్తలు తమవంతు సాయం అందిస్తున్నారు.

Khammam: బిగ్ బ్రేకింగ్..  ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై హైకోర్ట్ స్టే
Ntr Statue - Karate Kalyani
Follow us
Ram Naramaneni

|

Updated on: May 18, 2023 | 6:19 PM

ఖమ్మంలో అన్నగారి విగ్రహ ఏర్పాటుపై నీలిమేఘాలు అలముకుంటున్నాయి. విగ్రహ ఏర్పాటుపై తాజాగా  తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు విగ్రహం ఏర్పాటు చేయకూడదని ఆదేశాల్లో పేర్కొంది. ఖమ్మంలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణపై కొందరు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విగ్రహం కృష్ణుడి రూపంలో ఉండడం ఏంటనేది కొన్ని హిందూ, యాదవ సంఘాల ప్రశ్న. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ  శ్రీ కృష్ణ JAC, ఆదిభట్ల కళాపీఠం, భారతీయ యాదవ్ సంఘం.. కోర్టులో పిటిషన్స్ దాఖలు చేశాయి. వారి వాదనలు విన్న ధర్మాసనం విగ్రహ ఏర్పాటుపై స్టే విధించింది.

ఎన్టీఆర్ ఖ్యాతిని ప్రతిబింబించేలా 54 అడుగులు విగ్రహాన్ని ఖమ్మం లకారం చెరువులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుండగా.. తానా సభ్యులు, ఎన్నారైలు, పారిశ్రామిక వేత్తలు తమవంతు సాయం అందిస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం నాలుగు కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ విగ్రహం రూపు దిద్దుకుంటోంది. ఈ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిధిగా జూనియర్ ఎన్టీఆర్‌ రాక ఇప్పటికే ఫిక్స్ అయ్యింది. ఓవైపు ఏర్పాట్లు వేగంగా జరుగుతుంటే.. మరోవైపు కోర్టు విగ్రహ ఏర్పాటు స్టే విధించడం సంచలనంగా మారింది.  నిజానికి.. గత ఏడాదే ఖమ్మంలో ఎన్టీఆర్‌ విగ్రహం ఆవిష్కరించాల్సి ఉంది. కానీ.. పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. ప్రస్తుతం పనులు పూర్తి అయినా కోర్టు జోక్యంతో.. గందరగోళం ఏర్పడింది.

కోర్టు తీర్పుపై కరాటే కల్యాణి ఆనందం వ్యక్తం చేసింది. ధర్మం పక్షాన శ్రీ కృష్ణుడు ఉన్నాడని నిరూపితమైందని ఆమె పేర్కొంది. తమ పక్షాన నిలబడిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..