40 ఏళ్ల హీరోతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ ఇదే.. 

Rajitha Chanti

Pic credit - Instagram

21 January 2026

ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో మారుమోగుతున్న పేరు సారా అర్జున్. మొన్నటి వరకు చైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించిన ఈ అమ్మడు ఇప్పుడు హీరోయిన్ అయ్యింది.

ఇటీవల రణవీర్ సింగ్ సరసన ధురంధర్ సినిమాతో కథానాయికగా మారింది. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో హిట్టు అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇందులో 40 ఏళ్ల రణవీర్ సింగ్ సరసన నటించింది. ప్రస్తుతం సారా అర్జున్ వయసు 20 సంవత్సరాలు. దీంతో వీరిద్దరి ఏజ్ గ్యాప్ గురించి విమర్శలు వచ్చాయి.

ఈ ట్రోలింగ్ పై తొలిసారి పెదవి విప్పింది సారా అర్జున్. నెట్టింట తాను యాక్టివ్ గా ఉండనని తెలిపిందే. అందుకే ఏం జరుగుతుందో తనకు తెలీదని అన్నారు.

ఏజ్ గ్యాప్ గొడవంతా సోషల్ మీడియాలోనే జరుగుతుందని.. అయినా ప్రతి ఒక్కరికీ ఏదోక అభిప్రాయం ఉంటుందని తాను భావిస్తానని చెప్పుకొచ్చింది సారా.

 ఎవరి జీవితం వాళ్లది అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతాను.. కాబట్టి ఏజ్ గ్యాప్ నచ్చకపోవడమనేది వారి సమస్య.. నన్ను ఏమాత్రం ప్రభావితం చేయదు అని అన్నారు.

అలాంటివి తాను అసలు లెక్క చేయనని.. సినిమా కథేంటో తనకు తెలుసునని.. ఆ కథకు అనుగుణంగానే నడుచుకుంటానని చెప్పుకొచ్చింది సారా అర్జున్. 

ప్రస్తుతం తెలుగులో డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో యుఫోరియా సినిమాలో నటిస్తుంది.  అలాగే నెట్టింట ఈ బ్యూటీ ఫోటోస్ సైతం తెగ వైరల్ అవుతున్నాయి.