AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశ చరిత్రలోనే తొలిసారి.. పురుషుల CRPF బృందానికి సారధిగా శివంగి..!

రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఆర్డీ ప‌రేడ్‌లో సీఆరీపీఎఫ్ మార్చింగ్ బృందానికి సిమ్ర‌న్ బాలా క‌మాండెంట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. అంతక ముందు జరిగిన ఆర్డీ ప‌రేడ్ లో పురుషుల బృందాల‌కు సీఆర్పీఎఫ్ మ‌హిళా ఆఫీస‌ర్లలో ఎంతో మంది క‌మాండ్ చేశారు.

Prasanna Yadla
|

Updated on: Jan 21, 2026 | 6:38 PM

Share
ఈ ఏడాదిలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుక అనేక విధాలుగా ప్రత్యేకంగా ఉండబోతుంది.  ఇప్పటికీ వీటికి సంబంధించిన పనులు కూడా మొదలు పెట్టారు. అయితే, ఈ సారి ఓ మహిళా ఆఫీసర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఆమె పైనే ఉంది. మరి, ఆమె ఎవరో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
ఈ జనవరి 26న, గ్రాండ్ పరేడ్ సందర్భంగా ఒక ప్రత్యేక క్షణం చరిత్ర సృష్టించబోతుంది. ఇరవై ఆరేళ్ల అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రాన్ బాలా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) పూర్తి పురుషుల బృందానికి నాయకత్వం వహిస్తారు. ఆమె మొట్ట మొదటి మహిళా అధికారి అవుతుంది.ఈ మార్చ్‌లో సిమ్రాన్ 140 మందికి పైగా పురుష సైనికులకు నాయకత్వం వహిస్తారు. ఇది దేశంలోని అతిపెద్ద పారామిలిటరీ దళానికి, యూనిఫాంలో ఉన్న మహిళలకు అరుదైన గౌరవం.

2 / 5
అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రాన్ బాలా జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరికి చెందినవారు. రాజౌరి జిల్లా నుండి CRPF లో చేరిన మొదటి మహిళ ఆమె.

3 / 5
సిమ్రాన్ బాలా 2023లో UPSC CAPF అసిస్టెంట్ కమాండెంట్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. ఆమె అఖిల భారత స్థాయిలో 82 ర్యాంక్ సాధించింది. ఇది సిమ్రాన్ తొలి ప్రయత్నం. ఆమె తన 10వ తరగతిని నౌషేరాలోని నేషనల్ పబ్లిక్ స్కూల్‌లో, 11వ మరియు 12వ తరగతులను జమ్మూలోని పూర్తి చేసింది. ఆ తర్వాత ఆమె జమ్మూలోని గాంధీనగర్‌లోని ప్రభుత్వ మహిళా కళాశాల నుండి పొలిటికల్ సైన్స్‌లో పట్టభద్రురాలైంది.

4 / 5

UPSC అసిస్టెంట్ కమాండెంట్ నియామక పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, ఆమె గురుగ్రామ్‌లోని CRPF అకాడమీలో తన ప్రారంభ శిక్షణ పొందారు. ఈ సమయంలో ఆమెకు ఉత్తమ అధికారి, ప్రజా ప్రసంగ అవార్డులు లభించాయి.

5 / 5