అయ్యో పాపం ఏంటీ ఘోరం.. విహారయాత్రకు వెళ్లిన యువకుల్ని మింగేసిన మృత్యువు..

మృతి చెందిన యువకులను మెరీన్ ఓడ్డుకు చేర్చింది. నీటిలో మునిగి పోయిన స్నేహితులను కాపాడాలంటూ ఏపీ కంట్రోల్ రూమ్ కు మరో ఫ్రెండ్ హరి సూధన్ లొకేషన్ పంపి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు పోలీసులు.

అయ్యో పాపం ఏంటీ ఘోరం..  విహారయాత్రకు వెళ్లిన యువకుల్ని మింగేసిన మృత్యువు..
Two Indian Students Died In America
Follow us
Jyothi Gadda

|

Updated on: May 17, 2023 | 1:28 PM

ఏపీలో వేసవి విహార యాత్రల్లో విషాదాలు నెలకొంటున్నాయి. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు విహారయాత్రకు వెళ్లిన పర్యాటకులను విషాదం వెంటాడుతుంది. గడిచిన వారం రోజుల్లో మూడు ప్రమాదాలు జరిగాయి. మూడు రోజుల క్రితం కర్నూలు జిల్లా అవుకు బోటు ప్రమాదంలో ముగ్గురు చనిపోగా.. తాజాగా తిరుపతి జిల్లా నాగలాపురం మండలం టిపికోన భూపతిశ్వర జలపాతం సమీపంలోని నీటి గుండంలో పడి ముగ్గురు యువకులు చనిపోయారు.

మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నట్లు తెలుస్తుంది. విహారయాత్రకు నిన్న భూపతేశ్వర కోనకు మెరీన్ అనే యువతితో కలిసి వచ్చిన నలుగురు ఫ్రెండ్స్.. నాగలాపురం మండలం టిపి కోన ప్రాంతంలోని భూపతిశ్వర కోన జలపాతానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లి అక్కడి నీటి గుండంలో దిగారు. ఈత రాకపోవడంతో నీటి గుండంలో మునిగిపోయారు. మృతి చెందిన యువకులను మెరీన్ ఓడ్డుకు చేర్చింది. నీటిలో మునిగి పోయిన స్నేహితులను కాపాడాలంటూ ఏపీ కంట్రోల్ రూమ్ కు మరో ఫ్రెండ్ హరి సూధన్ లొకేషన్ పంపి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు పోలీసులు.

అలాగే రెండు రోజుల క్రితం తిరుపతి జిల్లా యలమంద గ్రామంలో చెరువులో పడి తాత, ఇద్దరు మనవళ్లు మృతి చెందారు. చేపలు పట్టేందుకు వెళ్లి నీటి మడుగులో పడిపోయిన నాగమణిని కాపాడే ప్రయత్నంలో ఇద్దరు మనవళ్లు మృతి చెందారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..