Lok Sabha Elections 2024: తెలంగాణలో తుదిఫలితం వెలువడేది అప్పుడే.. కౌంటింగ్ ప్రక్రియపై ఈసీ కీలక విషయాలు..
తెలంగాణలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద నాలుగు అంచెల భద్రత ఉంటుందన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఉండే ఏజెంట్లు, సిబ్బంది సెల్‌ఫోన్లు వినియోగించేందుకు అనుమతిలేదని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లవద్దని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి లెక్కింపు కేంద్రం వరకు పటిష్ఠ భద్రత ఉంటుందన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ప్రతి మూల కవర్ చేసేలా సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశామన్నారు.

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం 276 టేబుళ్లు ప్రత్యేకంగా ఉంటాయన్నారు వికాస్‌రాజ్. జూన్ 4న ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు, 8.30 గంటలకు ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా 24 రౌండ్లలో, అత్యల్పంగా 13 రౌండ్లలో లెక్కింపు ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపులో దాదాపు 10వేల మంది సిబ్బంది పాల్గొంటారని వివరించారు. ఇవాళ సాయంత్రం ఎగ్జిట్ఫోల్స్వెలువడే క్రమంలో కొన్ని రూల్స్ వెల్లడించారు. ఎగ్జిట్ ఫలితాల తర్వాత ఎలాంటి ర్యాలీలు, సభలకు అనుమతి లేదన్నారు వికాస్‌రాజ్.
హైదరాబాద్‌లో ఓట్ల లెక్కింపు కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు GHMC కమిషనర్ ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ చెప్పారు. 13 ప్రాంతాల్లో 16 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ ఎంపీ స్థానాలతోపాటు కంటోన్మెంట్ ఉపఎన్నికకు సంబంధించిన ఓట్లను ఇక్కడ లెక్కించనున్నారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటలలోపు కౌంటింగ్ ప్రక్రియ ముగిసేలా ప్రణాళికలు రచించినట్లు తెలిపారు. మూడు ప్రాంతాలు మినహా మిగిలిచ చోట్ల 18 నుంచి 21 రౌండ్లలోపు తుదిఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. ప్రతి రౌండులో మైక్రో అబ్జర్వర్లు కౌంటింగ్ జరిగిన తీరును, పోలైన ఓట్లను పరిశీలిస్తారన్నారు. కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకుని వాటిని అబ్జర్వర్ల టేబుల వద్దకు తీసుకువస్తారన్నారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి డేటా ఎంట్రీ చేస్తారన్నారు. ఆ డేటాను ఎన్నికల అధికారిక వెబ్ సైట్లో పొందుపరుస్తారు. వాటిని తిరిగి ప్రింట్ తీసి మరోసారి పరిశీలించి సంతకాలు చేసి సరైన డేటాను అందిస్తారు. దీంతో ఒక రౌండ్ పూర్తి అయినట్లు అని వివరించారు. ప్రతి రౌండులో ఇదేరకమైన ప్రాసెస్ ఉంటుందని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..