ACB Track Record: ఏసీబీ ట్రాక్ రికార్డ్.. 5నెలల్లో 50మంది అధికారులపై ఏసీబీ కేసులు..!
లంచం.. ఈ మాట వినిపిస్తే ఏసీబీ ప్రత్యక్షమవుతోంది. పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్టీఏ ఇలా..ఏ శాఖ అయినా సరే.. డోన్ట్ కేర్ అంటోంది. లంచావతారులను ట్రాప్ చేసి మరీ పట్టుకుంటోంది. కన్నింగ్ ఆఫీసర్లకు జైలులో చిప్ప కూడు తినిపిస్తోంది. గత ఐదు నెలల్లో ఏసీబీ అధికారుల ట్రాక్ రికార్డ్ చూస్తే.. అక్రమార్కులు గజగజ వణికిపోతున్నారు.

లంచం.. ఈ మాట వినిపిస్తే ఏసీబీ ప్రత్యక్షమవుతోంది. పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్టీఏ ఇలా..ఏ శాఖ అయినా సరే.. డోన్ట్ కేర్ అంటోంది. లంచావతారులను ట్రాప్ చేసి మరీ పట్టుకుంటోంది. కన్నింగ్ ఆఫీసర్లకు జైలులో చిప్ప కూడు తినిపిస్తోంది. గత ఐదు నెలల్లో ఏసీబీ అధికారుల ట్రాక్ రికార్డ్ చూస్తే.. అక్రమార్కులు గజగజ వణికిపోతున్నారు.
తెలంగాణలో అవినీతి అధికారులపై ఫోకస్ పెట్టింది ఏసీబీ. అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను వేటాడుతోంది. ఆదాయానికి మించి ఆస్తులు పోగేసిన వారిని టార్గెట్ చేసుకుని ఏసీబీ ముందుకు సాగుతోంది. అవినీతికి పాల్పడుతున్న అధికారులను ట్రాప్ చేసి మరీ పట్టుకుంటోంది. ఐదు నెలల్లో దాదాపు 50కి మందికిపైగా అధికారులపై కేసులు ఫైల్ చేసింది. అక్రమాస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరావుకు చిప్పకూడు తినిపించారు ఏసీబీ అధికారులు. ఫిర్యాదుదారుడు, నిందితుడు.. ఇద్దరి నుంచీ డబ్బు వసూలు చేయడంలో ఉమామహేశ్వరరావు మార్కే డిఫరెంట్. ల్యాండ్ సెటిల్మెంట్ కేసుల్లో ఉమామహేశ్వరరావు బాగా దండుకున్నట్టు గుర్తించారు .ఈ కన్నింగ్ ఏసీపీకి 14రోజుల రిమాండ్ విధించి జైలుకు పంపించింది ఏసీబీ. విచారణకు ఉమామహేశ్వరరావు సహకరించడం లేదని ఏసీబీ అధికారులు చెప్తున్నారు.
గత జనవరిలో HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ట్రాప్ చేసి పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. హెచ్ఎండీఏలో కింగ్ మేకర్‌గా శివబాలకృష్ణ అక్రమ వసూళ్లతో కోట్లాది రూపాయలు కూడబెట్టాడు. డబుల్ రోల్-డబుల్ క్యాష్ పద్ధతిలో బిల్డర్లకు, రియల్టర్లకు, ఇన్‌ఫ్రా ఓనర్లకు, ల్యాండ్ వెంచర్ల యజమానుల ఫైల్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బినామీల పేరుతో వందల ఎకరాలు కూడబెట్టాడు. ఈ అవినీతి తిమింగలాన్ని కూడా ఏసీబీ అధికారులు..జైలుకు పంపించారు.
నాంపల్లి ఇరిగేషన్ కార్యాలయం దాడులు చేసి నలుగురు ఇరిగేషన్ అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఈఈ బన్సీలాల్‌తో పాటు ఇద్దరు ఏఈలు, సర్వేయర్‌ను ట్రాప్ చేశారు. నలుగురు ఇరిగేషన్ అధికారులను నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఓ కేసు విషయంలో 3లక్షలు లంచం తీసుకుంటూ సీఐ వీరస్వామి, ఎస్సై షఫీ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
అవినీతి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్న RTA కార్యాలయాలపై ఏసీబీ నజర్ పెట్టింది. లారీ, టాక్సీ డ్రైవర్ల గెటపుల్లో ఆఫీసుల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్రమార్కుల భరతం పడుతున్నారు అధికారులు. మహబూబాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌లో పని చేస్తున్న ఐదుగురు ప్రైవేట్ ఏజెంట్లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్, మలక్‌పేట్, నాగోల్, అత్తాపూర్,బండ్లగూడ, మహబూబ్‌నగర్, సిద్దిపేట ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు చేశారు. పలువురు బ్రోకర్లతో పాటు అవినీతి అధికారులను అదుపులో తీసుకుని విచారించారు. మహబూబ్ నగర్, నల్లగొండ ఆర్టీఏ కార్యాలయంపై ఏసీబీ దాడులు చేసింది.
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో రూ. 25వేలు లంచం తీసుకుంటూ మహిళా ఎస్‌ఐ రాజ్యలక్ష్మి ఏసీబీ దొరికిపోయింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో 20 వేలు లంచం తీసుకుంటూ హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఏసీబీకి చిక్కాడు. లంచం తీసుకుంటూ నల్గొండ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సోమేశ్వర్ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు దొరికాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆశాఖ, ఈశాఖ అనే తేడా లేకుండా అవినీతి అధికారుల భరతం పడుతోంది ఏసీబీ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..