AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇంత సున్నితం ఏంట్రా బాబూ..! పదేళ్ల కొడుకు హెయిర్ కటింగ్ చేయించిన తండ్రి.. ఇంతలో తీవ్ర విషాదం

మహబూబాబాద్ జిల్లాలో విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. క్షణికావేశంలో పసి ప్రాణం గాలిలో కలిసింది. తనకు నచ్చని విధంగా తండ్రి హెయిర్ కటింగ్ చేయించాడని.. పదేళ్ళ బాలుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయింది ఆ కుటుంబం.

Telangana: ఇంత సున్నితం ఏంట్రా బాబూ..! పదేళ్ల కొడుకు హెయిర్ కటింగ్ చేయించిన తండ్రి.. ఇంతలో తీవ్ర విషాదం
Boy Hair Cut
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jun 01, 2024 | 12:03 PM

Share

ఇటీవల చిన్నారులు చిన్నచిన్న విషయాలకు కలత చెందడం, గొడవలకు దిగడం, అంతెందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలను కూడా మనం చూస్తూనే ఉన్నాం.. క్షణికావేశంలో నిండు నూరేళ్ల జీవితాన్ని అర్థంతరంగా ముగించుకుంటున్నారు.. తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చుతున్నారు.

తాజాగా  ఇలాంటి విషాదకర సంఘటన మహబూబాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. క్షణికావేశంలో పసి ప్రాణం గాలిలో కలిసింది. తనకు నచ్చని విధంగా తండ్రి హెయిర్ కటింగ్ చేయించాడని.. పదేళ్ళ బాలుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయింది ఆ కుటుంబం.

గంగారం మండలం చింతగూడెం గ్రామానికి చెందిన ఈసం కాంతరావు అనే రైతుకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడైన హర్షవర్ధన్ (10) సీతానాగారం లోని హాస్టల్ లో ఆరో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉన్నాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట హర్షవర్ధన్ తండ్రి కాంతారావు కటింగ్ షాపుకు తీసుకెళ్లారు. తనకు ఇష్టం లేని కటింగ్ చేపించారని తండ్రితో గొడవకు దిగిన బాలున్ని తండ్రి సముదాయించి ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం హర్షవర్ధన్ తల్లిదండ్రులు ఇంటి వెనుక పొలం పనులు చేసుకుంటుండగా హర్షవర్ధన్ పురుగుల మందు సేవించాడు.

పదేళ్ల హర్షవర్ధన్‌కి నాలుగు రోజుల క్రితం ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో పురుగులు మందు సేవించి ఆత్మహత్యకు యత్నించాడు. బాలుడిని గమంచిన తల్లిదండ్రులు చికిత్స కోసం హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతితో చింతగూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి..  ఈ హఠాత్ పరిణామంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..