Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warangal: ప్రాణం తీసిన ఒక్క రూపాయి.. తోపులాటలో కిందపడి చనిపోయిన ఆటో డ్రైవర్..!

వరంగల్ లో దారుణం జరిగింది. ఒక్క రూపాయి విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన చిల్లర ఘర్షణ, ఓ వ్యక్తి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. క్షణికావేశంలో మాటామాట పెరిగి తోపులాటకు దారి తీసింది. దీంతో ఓ వ్యక్తి కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు..

Warangal: ప్రాణం తీసిన ఒక్క రూపాయి.. తోపులాటలో కిందపడి చనిపోయిన ఆటో డ్రైవర్..!
Murdered For Rs 1
Follow us
G Peddeesh Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Jun 01, 2024 | 1:15 PM

వరంగల్ లో దారుణం జరిగింది. ఒక్క రూపాయి విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన చిల్లర ఘర్షణ, ఓ వ్యక్తి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. క్షణికావేశంలో మాటామాట పెరిగి తోపులాటకు దారి తీసింది. దీంతో ఓ వ్యక్తి కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు..

ఈ విషాద సంఘటన వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్‌లో జరిగింది.. ప్రేమ్ సాగర్ అనే వ్యక్తి ఆటో నడుపుకుంటున్నాడు. శుక్రవారం రాత్రి గాంధీనగర్‌లోని ఓ బిర్యానీ పాయింట్ వద్దకు బిర్యాని కోసం వచ్చాడు. అదే సమయంలో అరవింద్ అనే యువకుడు కూడా బిర్యాని కోసం అక్కడకు వచ్చాడు. ఆటో డ్రైవర్ ప్రేమ్ సాగర్ 59 రూపాయల బిర్యానికి, 60 రూపాయలు ఫోన్ పే కొట్టాడు. ఈ క్రమంలో ఒక్క రూపాయి ఎక్కువ కొట్టావ్ అంటూ అరవింద్ ఆటో డ్రైవర్‌ను ఎగతాళి చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి వాగ్వివాదానికి దారి తీసింది.

క్షణికావేశంలో ఇద్దరు పిడుగులు గుద్దుకున్నారు.. తోపులాటలో అరవింద్ ఆటో డ్రైవర్ ప్రేమ్ సాగర్ బలంగా నెట్టేయడంతో కిందపడి పక్కనే ఉన్న రాయికి అతని తల తాకి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతన్ని గమనించి ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. చిన్న మెదడు చిట్లి ప్రేమ్ సాగర్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆటో డ్రైవర్ డెడ్ బాడీని ఎంజీఎం మార్చురీకి తరలించారు.

ఒక్క రూపాయి ఇంతటి వివాదానికి కారణమైంది. క్షణికావేశం నిండు ప్రాణాలు బలి తీసుకుంది. అహంకారంతో ఆటోడ్రైవర్ ప్రాణాలు మింగేసిన యువకుడు అరవింద్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..