Cable Bridge: 7వ తేదీ నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై రాకపోకలు బంద్.. ! ఎందుకంటే..
జూబ్లీహిల్స్ నుంచి ఐక్య వైపు వెళ్లే వాహనదారులు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మీదుగా వెళ్లాలని సూచించారు. ఐక్య నుంచి జూబ్లీహిల్స్ వచ్చే వాహనాలు ఇన్ ఆర్బిట్ మాల్, దుర్గం చెరువు, మాదాపూర్ నుంచి డైవర్షన్ తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారు.
హైదరాబాద్‌లో ఐకానిక్ వంతెన కేబుల్ బ్రిడ్జి.. దుర్గం చెరువు వద్ద నిర్మించిన ఈ వంతెన సందర్శకులను ఆకట్టుకుంటుంది. చెరువుపై తీగల వంతెనగా పిలిచే ఈ బ్రిడ్జిని చూసేందుకు నగర వాసులు భారీగా తరలివస్తుంటారు. వీకెండ్‌లో అయితే రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ చూసేందుకు శని, ఆదివారాల్లో సందర్శకుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే, ఇప్పుడు ఈ కేబుల్ బ్రిడ్జిపై ఐదు రోజుల పాటు ఆంక్షలు విధిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు..పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై 3 రోజుల పాటు రాకపోకలు నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు బ్రిడ్జిని మూసివేస్తున్నట్లు తెలిపారు. మెయింటెనెన్స్ లో భాగంగా అత్యంత భారీ యంత్రాలతో మరమ్మతులు చేపట్టనున్నట్టుగా తెలిసింది. బ్రిడ్జి బరువును పరిశీలించేందుకు గానూ, దానిపై 100 టన్నుల క్రేన్లు ఉంచనుంది జీహెచ్ఎంసీ. దీంతో ఈ మార్గంలో రాకపోకలు కొనసాగించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.
జూబ్లీహిల్స్ నుంచి ఐక్య వైపు వెళ్లే వాహనదారులు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మీదుగా వెళ్లాలని సూచించారు. ఐక్య నుంచి జూబ్లీహిల్స్ వచ్చే వాహనాలు ఇన్ ఆర్బిట్ మాల్, దుర్గం చెరువు, మాదాపూర్ నుంచి డైవర్షన్ తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం..