Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dr Reddy’s Foundation: సోలార్ ప్యానల్ ఇన్‌స్టలేషన్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

ఐటిఐ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ డిప్లొమా చేసినవారికి గుడ్ న్యూస్..! డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోలార్ ప్యానల్ ఇన్‌స్టాలేషన్‌ ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అయితే దీనికి ఐటిఐ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ లేదా మెకానికల్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. 18 నుండి 28 ఏళ్ల వయసు కలిగి ఉన్న ఈ విద్యార్థులకు ఉచితంగా శిక్షణ తీసుకునేందుకు అర్హులని డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ వెల్లడించింది. సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్ శిక్షణ మూడు..

Dr Reddy's Foundation: సోలార్ ప్యానల్ ఇన్‌స్టలేషన్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం
Solar Panel Installation Diploma Course
Follow us
S Navya Chaitanya

| Edited By: Srilakshmi C

Updated on: Aug 03, 2023 | 11:47 AM

సిద్దిపేట, ఆగస్టు 2: ఐటిఐ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ డిప్లొమా చేసినవారికి గుడ్ న్యూస్..! డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోలార్ ప్యానల్ ఇన్‌స్టాలేషన్‌ ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అయితే దీనికి ఐటిఐ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ లేదా మెకానికల్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. 18 నుండి 28 ఏళ్ల వయసు కలిగి ఉన్న ఈ విద్యార్థులకు ఉచితంగా శిక్షణ తీసుకునేందుకు అర్హులని డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ వెల్లడించింది. సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్ శిక్షణ మూడు నెలల పాటు కొనసాగుతుంది. అయితే శిక్షణ కోసం ముందుగానే పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. పేరు నమోదు చేసుకోవడానికి ఫోన్ నెంబర్లు: 9964131921, 8019050334ను సంప్రదించవచ్చు. ఈ కోర్సులో భాగంగా సౌర విద్యుత్తును ఏ విధంగా తయారు చేస్తారు..? ఏలా ఏర్పాటు చెయ్యాలి..? వీటి సూత్రాలు ఏంటి? అన్నవాటిపై శిక్షణ ఇస్తారు.

సౌర విద్యుత్ అంటే..

సూర్య రష్మి నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్‌ను సౌర విద్యుత్ అంటారు. సౌర విద్యుత్ మొట్టమొదటిసారి 1980 దశకంలో ప్రారంభమైంది. వ్యాపార అవసరాల కోసం సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు నిర్మాణంలోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే రాష్ట్రం కర్ణాటక. ప్రతి సంవత్సరం 2050 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తుంది. సూర్యుని నుంచి దాదాపు 174 పెటావాట్ల శక్తి గల సూర్యకిరణాలు భూమికి వెలువడతాయి. ఇందులో 30 శాతం అంతరిక్షంలోకి తిరిగి వెళ్ళిపోతుంది. మిగతా 70 శాతం వేడిని సముద్రాలు మేఘాలు, భూమి గ్రహించుకుంటాయి. ఫోటో వోల్టాయిక్ ఘటాల నుంచి కానీ, ఉష్ణోగ్రత భేదాన్ని యంత శక్తిగా మార్చే హీట్ ఇంజన్ ల నుండి కానీ సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..