AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: క్షుద్రపూజలు ఇంత భయానకంగా ఉంటాయా..? ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తున్న దృశ్యాలు!

ఆస్తి తగాదాలు.. వ్యక్తిగత కక్షలతో పోలీస్ స్టేషన్లు. కోర్టు మెట్లు ఎక్కడం కామన్.. కానీ ట్రెండు మారింది క్షుద్ర పూజలు జరిపి శత్రు వినాశనాన్ని కోరుకోవడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ గా మారింది.

Watch Video: క్షుద్రపూజలు ఇంత భయానకంగా ఉంటాయా..? ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తున్న దృశ్యాలు!
Black Magic
G Peddeesh Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Nov 12, 2024 | 9:02 AM

Share

ఆస్తి తగాదాలు.. భూ వివాదాలు.. వ్యక్తిగత కక్ష్య సాధింపుకు క్షుద్ర పూజలే లేటెస్ట్ ట్రెండ్.. ఈ మధ్య ఎక్కడ చూసినా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. ఇటీవల క్షుద్రపూజలు చేసేందుకు ఏకంగా ఖండాలు దాటి మరీ వెళ్లి చేసి వచ్చారట. ఈ క్రమంలోనే తాజాగా అక్కడ దడ పుట్టిస్తున్నాయి వరుస క్షుద్ర పూజలు.

ఆస్తి తగాదాలు.. వ్యక్తిగత కక్షలతో పోలీస్ స్టేషన్లు. కోర్టు మెట్లు ఎక్కడం కామన్.. కానీ ట్రెండు మారింది క్షుద్ర పూజలు జరిపి శత్రు వినాశనాన్ని కోరుకోవడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ గా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ క్షుద్ర పూజల మూర్ఖులు పెరిగిపోతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రోజుకోచోట క్షుద్ర పూజలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ముసుగు ధరించి వచ్చిన ఓ వ్యక్తి ఓ ఇంటి ముందు ఎలా క్షుద్రపూజలు నిర్వహించారో చూసి అక్కడివారు ఆందోళన చెందుతున్నారు. ఆ ముసుగు మాంత్రికుడి క్షుద్రపూజలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

ఎంతటి మూతి మీద మీసాలు మెలేసే ఎవరికైనా కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. క్షుద్ర పూజలు అంటే దాదాపుగా ఎవరికైనా వణుకు పుడుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో వెలుగు చూసిన క్షుద్రపూజలు కలకలం రేపాయి. కాటారం-మహాదేవపూర్ ప్రధాన రహదారి పక్కనే పోచిరెడ్డి అనే వ్యక్తి ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తి ఈ క్షుద్రపూజలు నిర్వహించాడు. ములుగు ధరించి వచ్చిన ఆ వ్యక్తి క్షుద్రపూజలు నిర్వహించడం సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. తెల్లవారి లేచి చూసేసరికి ఇంటి ముందు పసుపు, కుంకుమ, నల్ల కోడి, నిమ్మకాయలు, కోడిగుడ్లు ఉండడంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురై సీసీ కెమెరా ఫుటేజ్ చూసి షాక్ అయ్యారు.

ముసుగు ధరించి వచ్చి ఇంటి ముందు క్షుద్రపూజలు చేసిన ఆ వ్యక్తి ఎవరని ఆరా తీస్తున్నారు. అయితే ఆదివారం మహాదేవపూర్ మండలం కుదురుపల్లి అటవీ ప్రాంతంలో క్షుద్రపూజలు చేస్తుండగా వారిని గ్రామస్తులు పోలీసులకు పట్టించారు. సోమవారం కాటారం మండలం సుబ్బయ్యపల్లి ప్రధాన రహదారిపై క్షుద్ర పూజలు కలకలం రేపాయి. రోజుకో చోటా క్షుద్రపూజలు ఈ ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి.

వీడియో చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..