Telangana: మావోయిస్టు క‌ద‌లిక‌ల‌పై నిరంత‌ర అప్రమత్తత అవ‌స‌రం.. డీజీపీ అంజనీ కుమార్ అధికారులకు ఆదేశం

తెలంగాణలో ఏ ఒక్క చిన్న సంఘటన జరిగినా అది రాష్ట్ర అభివృద్ధి పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఇలాంటి ఈపరిస్థితుల్లో పోలీస్ అధికారులు మ‌రింత అప్రమ‌త్తంగా ఉండాలని డీజీపీ అంజ‌నీ కుమార్ ఆదేశించారు. దక్షిణ బస్తర్‌లోని అరుణ‌పూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఏప్రిల్ 26న జ‌రిగిన మందుపాత‌ర పేలుడులో 10 మంది భ‌ద్రతా సిబ్బందితోపాటు ఒక పౌరుడు మ‌ర‌ణించిన విషయం తెలిసిందే.

Telangana: మావోయిస్టు క‌ద‌లిక‌ల‌పై నిరంత‌ర అప్రమత్తత అవ‌స‌రం.. డీజీపీ అంజనీ కుమార్ అధికారులకు ఆదేశం
Dgp Anjani Kumar
Follow us

|

Updated on: May 04, 2023 | 4:51 PM

తెలంగాణలో ఏ ఒక్క చిన్న సంఘటన జరిగినా అది రాష్ట్ర అభివృద్ధి పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఇలాంటి ఈపరిస్థితుల్లో పోలీస్ అధికారులు మ‌రింత అప్రమ‌త్తంగా ఉండాలని డీజీపీ అంజ‌నీ కుమార్ ఆదేశించారు. దక్షిణ బస్తర్‌లోని అరుణ‌పూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఏప్రిల్ 26న జ‌రిగిన మందుపాత‌ర పేలుడులో 10 మంది భ‌ద్రతా సిబ్బందితోపాటు ఒక పౌరుడు మ‌ర‌ణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వామ‌ప‌క్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల పోలీస్ అధికారుల‌తో ఆయన గురువారం త‌న కార్యాల‌యం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ‌ర్క్‌షాప్ నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో రాష్ట్రంలో రాజ‌కీయ ప్రముఖులు, వీవీఐపీల ప‌ర్యటన స‌మ‌యంలో భ‌ద్రతా బ‌ల‌గాలు సంచరించే సమయంలో త‌గు జాగ్రత్తలు తీసుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు. అలాగే రాష్ట్రాల స‌రిహ‌ద్దుల ప్రాంతాల్లో మావోయిస్టుల యాక్షన్ టీంల క‌ద‌లిక‌లు పెరిగే అవ‌కాశం ఉంద‌ని, ఆ విష‌యంలో మ‌రింత అప్రత్తంగా ఉండాల‌న్నారు.

ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఐటీ ప‌రిశ్రమ‌లు, అనేక‌ బ‌హుళ‌జాతి సంస్థలు హైద‌రాబాద్ కేంద్రంగా త‌మ కార్యాల‌యాలు ఏర్పాటు చేసుకున్నాయ‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఏ చిన్న సంఘ‌ట‌న జ‌రిగినా అంత‌ర్జాతీయంగా ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంద‌ని వివరించారు. అలాగే మావోయిస్టులు వ్యూహాత్మకంగా వ్యవహ‌రిస్తున్నార‌ని, ఒక‌ర్ని దెబ్బతీయ‌డం వ‌ల్ల వేలాది మందిని భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసేలా చేస్తున్నారని.. కాబ‌ట్టి ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్రతిక్షణం అప్రమ‌త్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ‌లో వామ‌ప‌క్ష తీవ్రవాదం పూర్తిగా అంత‌రించిపోయింద‌ని.. దీనికి పోలీస్ శాఖ నిరంత‌ర కృషే కార‌ణ‌మ‌న్నారు. మావోయిస్టు చ‌ర్యల‌కు సంబంధించిన కీల‌క దాడుల్ని వివ‌రించారు. రాష్ట్రంలో 80శాతం కొత్తగా విధుల్లో చేరిన పోలీసులు ఉండ‌టం వ‌ల్ల మావోయిస్టు వ్యూహాలు, చ‌ర్యలు, దాడుల‌పై మ‌రింత అవ‌గాహ‌న ఏర్పరుచుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.