Priyanka Gandhi: హైదరాబాద్‌కు రానున్న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ.. ఎప్పుడంటే
2014, 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓటమిని ఎదుర్కొన్న కాంగ్రెస్ మళ్లీ అధికారం కోసం పరితపిస్తోంది. ఇటీవల జరిగిన హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో పార్టీ శ్రేణుల్లో కొంత ఊపు వచ్చింది. మరికొద్ది రోజుల్లోనే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో జరగనున్న నేపథ్యంలో అక్కడ తమ జోరుగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు.

2014, 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓటమిని ఎదుర్కొన్న కాంగ్రెస్ మళ్లీ అధికారం కోసం పరితపిస్తోంది. ఇటీవల జరిగిన హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో పార్టీ శ్రేణుల్లో కొంత ఊపు వచ్చింది. మరికొద్ది రోజుల్లోనే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో జరగనున్న నేపథ్యంలో అక్కడ తమ జోరుగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు. అయితే కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతంరం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 8 వ తేదిన సరూర్ నగర్‌లో జరగనున్న కాంగ్రెస్ బహిరంగ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొంటారని టీపీసీసీ వర్కింగ్ ప్రెజిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
ఈ నేపథ్యంలో సరూర్‌నగర్ మైదానాన్ని కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. కర్ణాటక ఎన్నికలు ముగిసిన అనంతంరం హైదరాబాద్ వచ్చేందుకు ప్రియాంక గాంధీ ఒప్పుకున్నారని మహేష్ గౌడ్ తెలిపారు.నిరుద్యోగులకు ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రియాంక గాంధీ వివరిస్తారని పేర్కొన్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరిస్తారని తెలిపారు. ప్రియాంక గాంధీ హైదరాబాద్ రావడం కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త నింపుతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
