Kukatpally: చికెన్ పకోడిలో కారం ఎక్కువైందన్న కస్టమర్.. దీంతో రెచ్చిపోయిన షాపు ఓనర్…

చికెన్ పకోడిలో కారం ఎక్కువైంది అన్నాడు కస్టమర్. దీంతో అతడి కోపం నషాలానికి అంటింది. తింటే తిను.. లేదంటే లేదు అని కసురుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. అది కత్తితో దాడి చేసే వరకు వెళ్లింది. వివరాలు....

Kukatpally: చికెన్ పకోడిలో కారం ఎక్కువైందన్న కస్టమర్.. దీంతో రెచ్చిపోయిన షాపు ఓనర్...
Chicken Pakodi (representative image)
Follow us
Ram Naramaneni

|

Updated on: May 04, 2023 | 4:37 PM

కస్టమర్ పై కత్తితో దాడి చేశాడు చికెన్ పకోడి షాపు ఓనర్.చికెన్ పకోడిలో కారం ఎక్కువ అయిందని చెప్పిన కస్టమర్ పై కత్తితో దాడి చేశాడు. చేతిపై, చెవిపై తీవ్రంగా గాయపరిచాడు. గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులోని 9వ ఫేజులో ఉన్న జెఎస్ చికెన్ పకోడి సెంటర్ వద్దకు తినేందుకు వెళ్లాడు కస్టమర్ నాగార్జున. చికెన్ పకోడీ తింటున్న క్రమంలో కారం ఎక్కువయ్యిందంటూ షాప్ నిర్వాహకుడు జీవన్ కు చెప్పాడు. దీంతో కోపోద్రేకుడైన షాప్ ఓనర్ జీవన్.. తింటే తినండి లేకుంటే వెళ్ళిపో అంటూ దూషించాడు.

దీంతో కస్టమర్ నాగార్జున షాపు ఓనర్ జీవన్ కి మధ్య గొడవ జరిగింది. తీవ్ర పదజాలంతో కస్టమర్ ను తిట్టాడు ఓనర్ జీవన్. గొడవ పెద్దది కావడంతో కస్టమర్ నాగార్జునపై జీవన్ కత్తితో దాడి చేస్తుండగా, అడ్డుగా వెళ్లిన ప్రణీత్ రెడ్డికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. షాపుకు 10 రకాల కస్టమర్స్ వస్తారు. ఒక్కొక్కరు ఒక్కో రకం రివ్యూ ఇస్తూ ఉంటారు. సర్దుకుని వెళ్లిపోవాలి కానీ.. ఇలా వేట్లు వేసుకుంటూ పోతారా..? నాలుగు కాలాలు బాగుండాలంటే.. కాస్త పద్ధతిగా, ఒద్దికగా, గౌరవం ఇచ్చి పుచ్చుకుంటూ.. నవ్వుతూ సాగిపోవాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..