Heavy Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లన్ని జలమయం.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక
వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, యూసుఫ్‌గూడ, మణికొండ, టోలీచౌకి, గచ్చిబౌలి ప్రాంతాల్లో..

వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, యూసుఫ్‌గూడ, మణికొండ, టోలీచౌకి, గచ్చిబౌలి ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. నగరంలో భారీ ఈదురుగాలులతో వర్షం కురియడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే షేక్‌పేట, నార్సింగ్, మెహిదీపట్నం, కూకల్‌పల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అయితే హైదరాబాద్‌లో మరో రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. నగర వాసులు బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షం కారణంగా సహాయం కోసం జీహెచ్‌ఎంసీ అధికారులు టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. ఏవైనా సమస్యలుంటే.. టోల్‌ఫ్రీ నెంబర్ 040-29555500 సంప్రదించాలని అధికారులు సూచించారు.
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు దంచి కొడుతున్నాయి. వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అన్నదాతను ఆగమాగం చేశాయి. ఎండాకాలంలో అకాల వర్షాలతో పంటలు భారీగా దెబ్బతిన్నడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. నష్టపోయిన పంటను చూసి కన్నీరు పెడుతున్నారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ మళ్లీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరిన్నిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. విదర్భ నుండి తమిళనాడు వరకు తెలంగాణ, కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతుండటంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈనెల 8వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ పేర్కొంది.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి