AP Bhavan Delhi: కొలిక్కి వచ్చిన ఏపీ భవన్ విభజన.. ఆంధ్రప్రదేశ్‌కు ఏపీ భవన్‌, తెలంగాణకు పటౌడీ హౌస్..!

ఢిల్లీలోని ఏపీ భవన్‌ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. ఏపీ భవన్‌ భవనాలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ కేంద్రం ప్రతిపాదించింది. అయితే.. తెలంగాణ విజ్ఞప్తికి పూర్తి భిన్నమైన ప్రతిపాదన చేయడం ఆసక్తి రేపుతోంది. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన అంశం దాదాపు కొలిక్కి వచ్చేసింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ అధికారులతో పలుమార్లు సమావేశమైన కేంద్ర హోం శాఖ..

AP Bhavan Delhi: కొలిక్కి వచ్చిన ఏపీ భవన్ విభజన.. ఆంధ్రప్రదేశ్‌కు ఏపీ భవన్‌, తెలంగాణకు పటౌడీ హౌస్..!
Ap Bhavan
Follow us

|

Updated on: May 05, 2023 | 7:30 AM

ఢిల్లీలోని ఏపీ భవన్‌ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. ఏపీ భవన్‌ భవనాలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ కేంద్రం ప్రతిపాదించింది. అయితే.. తెలంగాణ విజ్ఞప్తికి పూర్తి భిన్నమైన ప్రతిపాదన చేయడం ఆసక్తి రేపుతోంది. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన అంశం దాదాపు కొలిక్కి వచ్చేసింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ అధికారులతో పలుమార్లు సమావేశమైన కేంద్ర హోం శాఖ.. వాటికి సంబంధించిన మినిట్స్‌ను విడుదల చేసింది.

భూములు, భవనాల విభజనపై గతంలో ఆంధ్రప్రదేశ్ మూడు ప్రతిపాదనలు చేసింది. తాజాగా తెలంగాణ మరో ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. గోదావరి, శబరి బ్లాకులు, నర్సింగ్‌ హాస్టల్‌ పక్కనే ఉన్న ఖాళీ స్థలం తమకు ఇవ్వాలని తెలంగాణ కోరగా.. కేంద్ర హోంశాఖ మాత్రం పూర్తి భిన్నమైన ప్రతిపాదన చేసింది. 7.64 ఎకరాల పటౌడీ హౌస్‌ను తెలంగాణ తీసుకోవాలని ప్రతిపాదించింది. మిగిలిన 12.09 ఎకరాల ఖాళీ భూమి ఏపీ తీసుకోవాలని ప్రతిపాదించింది. ఆస్తులను 58:42 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ పంచుకోవాలని కేంద్రం సూచించింది. దాంతో.. ఏపీ, తెలంగాణ జనాభా నిష్పత్తికి అనుగుణంగా రెండు రాష్ట్రాలకు వాటా దక్కనుంది. ఒకవేళ ఏపీకి అదనపు భూమి దక్కితే.. ఆ ప్రభుత్వం నుంచి భర్తీ చేసుకోవాలని తెలంగాణకు సూచించింది కేంద్ర హోంశాఖ.

పటౌడీ హౌస్‌ స్థలం తీసుకోవాలని ఏపీకి విజ్ఞప్తులు..

వాస్తవానికి.. ఏపీ భవన్‌ను దక్కించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నాలు చేసింది. ఏపీ భవన్‌ను తమకు వదిలేస్తే.. దానికి బదులుగా పటౌడీ హౌస్‌లోని స్థలాన్ని తీసుకుని అక్కడ కొత్త భవనాన్ని నిర్మించుకోవాలని ఏపీ అధికారులను తెలంగాణ ప్రభుత్వం పదేపదే కోరింది. నిజాం నిర్మించిన హైదరాబాద్‌ హౌస్‌కు ఆనుకొని ఉన్న స్థలంతో భావోద్వేగ సంబంధాలున్నాయని తెలంగాణ సర్కార్ చెప్పుకొచ్చింది. కానీ.. తెలంగాణ ప్రతిపాదనలకు అంగీకరిస్తే కీలకమైన కూడలిలో ఆంధ్రప్రదేశ్‌ అస్తిత్వం, చరిత్ర కనుమరుగు అవుతుందనే వాదనలు తెరపైకి రావడంతో ఆలోచనలో పడింది జగన్‌ సర్కార్‌.

ఇవి కూడా చదవండి

ఏపీ.. తెలంగాణ ప్రభుత్వాలు పట్టుబట్టుకుని కూర్చోవడంతో కేంద్రం చర్చలు జరిపిన ప్రతిసారీ కొత్త ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. దాంతో.. విభజన మరింత ఆలస్యమైంది. కానీ.. కేంద్రం ఇప్పుడు జనాభా నిష్పత్తుల్లో లెక్కలు తేల్చేయడంతో ఏపీ భవన్‌ విభజన అంశం కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. ఇక.. కేంద్ర ప్రతిపాదన ఆచరణ యోగ్యంగా ఉందని ఏపీ ప్రభుత్వం వెల్లడించగా.. తెలంగాణ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని తెలంగాణ&ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..